Venkatesh, Varun Tej: వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ అలానే కనిపిస్తారట..!

అది ‘ఎఫ్‌ 3’ షూటింగ్‌ మొదలైన తొలి రోజులు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ సెట్స్‌ మీద కంటిన్యూస్‌గా వర్క్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సెట్స్‌ నుండి ఓ రూమర్‌ బయటకు వచ్చింది. అదేగనక నిజమైతే… కామెడీ అదిరిపోతుంది అని అందరూ అనుకున్నారు. అప్పటికే దర్శకుడు అనీల్‌ రావిపూడి అలాంటి కాన్సెప్ట్‌ హ్యాండిల్‌ చేసి ఉన్నాడు. దీంతో పక్కాగా అదిరిపోతుంది అనుకున్నారు. అదే సినిమాలో వెంకటేశ్ రేచీకటి బాధితుడిగా, వరుణ్‌తేజ్‌ నత్తివాడిగా కనిపిస్తాడని.

తాజాగా ఈ కాన్సెప్ట్‌ విషయంలో దర్శకుడు అనీల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. అందరూ అనుకుంటున్నట్లే ఈ సినిమాలో వెంకీ, వరుణ్‌ పాత్రలు అలానే ఉండబోతున్నాయట. ‘ఎఫ్‌ 2’లో లేని ఈ రెండు విషయాలను ఈ సినిమాలో తీసుకొస్తున్నట్లు చెప్పాడు. దీని వల్ల కామెడీ మరింతగా పెరుగుతుందని ఆయన చెబుతున్నాడు. ఈ రెండు ఇబ్బందుల మీద మంచి కామెడీ సీన్స్‌ రాసుకున్నాడని టాక్‌. ‘ఎఫ్‌ 3’ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని తొలుత వార్తలొచ్చాయి.

అయితే పెద్ద సినిమాలు రావడం వల్ల సినిమా వసూళ్ల విషయంలో ఇబ్బంది రాకూడదని, వెనక్కి తగ్గింది. ఆ సినిమాల మధ్య నలిగిపోవడం ఎందుకు అన్నాడు అనీల్‌ రావిపూడి. అంతేకాదు తమ సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే పండగ అని కూడా అంటున్నాడు దర్శకుడు. అన్నట్లు తెలుగులో సీక్వెల్స్‌కి ఏమంత మంచి ట్రాక్‌ రికార్డు లేదు. ఈ సినిమా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేయాలని ఆశిద్దాం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus