Narappa Movie: వెంకీ జవాబుతో వాళ్లు కూల్ అవుతారా?

  • July 13, 2021 / 04:24 PM IST

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజైన తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతారు. అయితే మరికొన్ని రోజుల్లో థియేటర్లు తెరచుకోబోతున్నప్పటికీ వెంకటేష్ నటిస్తున్న నారప్ప మాత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఓటీటీలో నారప్ప సినిమాను రిలీజ్ చేయడంపై ఏపీ, తెలంగాణ థియేటర్ల ఓనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ మాత్రం ఓటీటీలో రిలీజ్ చేయడానికి గల కారణం చెబుతూ పరోక్షంగా థియేటర్ల ఓనర్లు కూల్ అయ్యేలా చేశారు.

శ్రేయోభిలాషులు, అభిమానులు నారప్ప సినిమాను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాకు, చిత్ర బృందానికి మీపై చాలా ప్రేమ ఉందని వెంకటేష్ పేర్కొన్నారు. కంఫర్ట్ అండ్ సేఫ్టీగా ఇష్టమైన వారితో కలిసి నారప్ప సినిమాను చూడాలని విక్టరీ వెంకటేష్ వెల్లడించారు. అభిమానులు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో నారప్పను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని వెంకటేష్ అన్నారు. వెంకీ జవాబుతో థియేటర్ల ఓనర్లు కూల్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

నారప్ప సినిమా ఓటీటీలో రిలీజవుతుండటం వెంకీ అభిమానులలో కూడా కొంతమందికి నచ్చడం లేదు. మరోవైపు వెంకీ తర్వాత సినిమా దృశ్యం2 కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. నారప్ప ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రైమ్ లో రిలీజ్ కానున్న నారప్ప సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus