తన భర్త గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చిన ఆశ్రిత..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి 2019 మార్చిలో.. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత అయిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈమె పెళ్లి వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించారు వెంకటేష్ మరియు సురేష్ బాబులు. ఆశ్రిత ప్రస్తుతం తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటూ వస్తుంది. ఈమె ప్రొఫెషనల్ బేకర్ అని కూడా అందరికీ తెలిసిన సంగతే..! ఈమె సోషల్ మీడియాలో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే పేరుతో ఓ అకౌంట్‌ను కూడా మెయింటైన్ చేస్తూ వస్తోంది.

దీని ద్వారా అనేక రకాల ఫుడ్ స్పెషల్స్ గురించి ప్రేక్షకులకు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎకౌంట్ ద్వారా తాజాగా అభిమానులతో ముచ్చటించింది ఆశ్రిత. ఈ చాట్ సెషన్ లో తన భర్త గురించి అలాగే తన పెళ్లి గురించి ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియని విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ‘మీది లవ్ మ్యారేజా’ అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆశ్రీత సమాధానమిస్తూ… ‘నాది లవ్ మ్యారేజ్ కాదు.

కానీ నేను, నా భర్త వినాయక్.. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఎప్పటి నుండో మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ స్నేహం కాస్త తరువాత పెళ్ళికి దారి తీసిందని ఈమె చెప్పిన సమాధానంతో స్పష్టమవుతుంది. అలాగే రానా భార్య మిహీక అంటే చాలా ఇష్టమని కూడా ఈమె తెలిపింది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus