Venkatesh: మొదటిసారి రానా నాయుడు బోల్డ్ సీన్స్ పై స్పందించిన వెంకి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలలో నటించి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. వెంకటేష్ సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే చెప్పాలి. ఇలా గత నాలుగు సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన రానానాయుడు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ వెబ్ సిరీస్ లో రానాతో కలిసి నటించారు. అయితే ఇందులో (Venkatesh) వెంకటేష్ బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. ఈ ఒక్క వెబ్ సిరీస్ తో వెంకటేష్ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ కూడా గంగలో కలిసిపోయాయని చెప్పాలి. ఇలా ఈ వెబ్ సిరీస్ గురించి ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ వెంకటేష్ మాత్రం ఎప్పుడూ ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా ఈయన తన అన్నయ్య కుమారుడు అభిరామ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నటువంటి అహింస సినిమా విడుదల కాబోతోంది.

ఈ సినిమా జూన్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విలేకరులు వెంకటేష్ ను రానా నాయుడు వెబ్ సిరీస్ లోని బోల్డ్ సన్నివేశాల గురించి ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు వెంకటేష్ సమాధానం చెబుతూ…

రానా నాయుడు వెబ్ సిరీస్ కు చాలా మంచి ఆదరణ లభించిందని తెలిపారు. అయితే ఈ సిరీస్ బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని, వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందుకు వెళ్లిపోవాలని ఈయన తెలియజేశారు.అయితే వచ్చే సీజన్లో మాత్రం అలాంటి సన్నివేశాలు ఉండవని వచ్చే సీజన్ ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుంది అంటూ వెంకటేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus