వెంకీ మామ ఎఫ్ 3 కోసం అంత అడుగుతున్నాడా?

మినిమమ్ గ్యారంటీ హీరోలలో వెంకటేష్ ఒకరు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఆయన విక్టరీ తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. ఒక స్టేజి నుండి ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ లు, వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్నారు. 2013లో మహేష్ తో కలిసి ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రామ్ తో బోల్ బచ్చన్ అనే హిందీ చిత్రానికి రీమేక్ గా మసాలా చేశారు.

మరో హిందీ చిత్రం ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చిత్రంతో పవన్ తో కలిసి నటించారు. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో మరో హీరోగా వరుణ్ చేశారు. ఇక ఈ సూపర్ హిట్ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తుండగా వెంకటేష్ ఈ పార్ట్ లో కూడా నటిస్తున్నారట. ఐతే ఈ చిత్రం కొరకు వెంకటేష్ డబుల్ పేమెంట్ అడుగుతున్నారట.

venkatesh hikes his remuneration for F3 movie1

అంటే తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి రెట్టింపు ఆయన డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. సాధారణంగా వెంకటేష్ ఓ మూవీకి 5 నుండి 6కోట్ల పారితోషికం తీసుకుంటారట. కాగా ఈ మూవీ కోసం ఆయన 10కోట్లకు పైన అడుగుతున్నారని వినికిడి. వెంకటేష్ ట్రాక్ సైతం ఇప్పుడు బాగుంది. గురు ఓ మోస్తరు విజయాన్ని అందుకోగా ఆయన గత రెండు చిత్రాలు ఎఫ్ 2, వెంకీ మామ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి వసూళ్లను అందుకున్నాయి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus