సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ కోసం వెంకీ మామ

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో నటించినప్పట్నుండి మహేష్ & వెంకటేష్ లను “పెద్దోడు – చిన్నోడు” అని పిలుచుకొంటుంటారు అభిమానులు. అందుకు తగ్గట్లే మహేష్ విక్టరీ వెంకటేష్ ను అన్నయ్య అని పిలుస్తుంటారు. ఇక మన వెంకీ మామ సూపర్ స్టార్ మహేష్ ను సొంత తమ్ముడిలా భావించి.. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. “మహర్షి” ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు “సరిలేరు నీకెవ్వరు” ప్రమోషన్స్ లోనూ వెంకీ భాగస్వామి అయ్యారు. సంక్రాంతి సందర్భంగా “సరిలేరు నీకెవ్వరు” సినిమా కోసం స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు వెంకటేష్. వెంకటేష్, మహేష్ బాబు, అనిల్ రావిపూడిల డిస్కషన్ త్వరలోనే విడుదల చేయనుంది చిత్రబృందం. వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “ఎఫ్ 2” సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి కావడం, మహేష్ తో మంచి అనుభంధం ఉండడం వల్లే వెంకీ ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాడు. ఏదేమైనా ఇలా సీనియర్ స్టార్ హీరోలు, యంగ్ స్టార్ హీరోలు ఒక త్రాటిపై నడవడం అనేది ఆనందించదగిన విషయం.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus