Venkatesh, Nagarjuna, Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో మరో ఇద్దరు స్టార్స్!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరో కీలకపాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించనున్నారు.

ఈయనతో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని.. ఆయనపై ఓ స్పెషల్ సీన్ ను చిత్రీకరించినట్లు చెబుతున్నారు. వెంకీకి సంబంధించిన సీన్ థియేటర్లో నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. వెంకటేష్ తో పాటు మరో స్టార్ హీరో నాగార్జున కూడా చిరు సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారట. త్వరలోనే నాగ్ కూడా ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటారని టాక్.

ఇది నిజమే అయితే గనుక సినిమాపై మంచి క్రియేట్ అవ్వడం ఖాయం. ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలిన ముగ్గురు హీరోలు ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ గ్యారెంటీ. ఈ విషయంపై చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి! ఈ సినిమాను రూ.150 కోట్ల బడ్జెట్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. అందులో ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్స్ కోసమే ఖర్చవుతుందట.

ఈ సినిమాలో మలయాళ నటుడు బిజూ మీనన్ విలన్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సినిమాతో పాటు చిరు ‘భోళా శంకర్’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus