దృశ్యం దర్శకుడితో వెంకీ!

అప్పటికి సోలో హీరోగా వెంకీని దాదాపుగా అందరూ మర్చిపోతున్న తరుణంలో ఓ మలయాళ చిత్రం రీమేక్ వాడిపోతున్న వెంకీ కెరీర్ కు నీళ్ళు పోసింది. ఆ సినిమా పేరు “దృశ్యం”. ఆ సినిమా రూపకర్త అయిన మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ ప్రస్తుతం “ఉజమ్” అనే ఓ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సదరు సినిమా ట్రైలర్ కు విశేషమైన స్పందన లభించింది.

అయితే.. ప్రస్తుతం “సాలా ఖడూస్” రీమేక్ లో నటిస్తున్న వెంకీ ఆ సినిమా అనంతరం “దృశ్యం” డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల జీతు జోసెఫ్ హైద్రాబాద్ వచ్చి వెంకీని కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పాడని, కథ నచ్చిన వెంకీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని రమ్మాడని వినికిడి. అన్నీ సెట్ అయితే.. ఈ ఏడాది చివర్లోనే సినిమా మొదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus