Sankranthiki Vasthunnam: లీడ్ ఇచ్చారు.. వెంకీ చెప్పారు.. ఇక డౌట్ ఎందుకు?

టాలీవుడ్లో రాజమౌళి  (S. S. Rajamouli)  తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి  (Anil Ravipudi)  నిలిచిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 8 హిట్లు కొట్టి సూపర్ ఫామ్లో ఉన్నాడు అనిల్ రావిపూడి. అయితే అనిల్ ఇప్పటివరకు ఇచ్చిన సక్సెస్..లు వేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunnam)  సక్సెస్ వేరు. ఎందుకంటే ఇది పక్కా సంక్రాంతి ఫార్ములా సినిమా. టైటిల్ నుండి సినిమాలో పల్లెటూరి వాతావరణం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ వంటి వాటితో అనిల్ తీసిన సినిమా ఇది.

Sankranthiki Vasthunnam

కచ్చితంగా ఇది సేఫ్ సినిమా.. కానీ ఏకంగా రూ.300 కోట్లు కలెక్ట్ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అనిల్ రావిపూడి కూడా ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ అయిన 4వ వారం కూడా కొత్త సినిమాలకి కూడా రాని వసూళ్లు ఈ సినిమాకి వస్తున్నాయి. సో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి సినిమాలకి థియేటర్లకు రావాలి అనుకుంటున్నారు? అనేది కూడా ఈ సినిమా చాటిచెప్పింది.

పండుగ సీజన్లలో పెద్ద సినిమాలు ఉంటే చాలు..డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు అనేది కూడా ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. అందుకే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాలను కూడా పండుగా సీజన్లకే దింపుతున్నాడు. చిరంజీవితో (Chiranjeevi)  అనిల్ ఒక సినిమా చేస్తున్నాడు. ‘విశ్వంభర’ రిలీజ్ అయ్యాక అది సెట్స్ పైకి వెళ్తుంది. అయితే 2026 సంక్రాంతి కనుకగానే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని నిర్మాత సాహు ముందుగానే ప్రకటించేశారు.

అలాగే 2027 సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి సినిమా ఫిక్స్ అయిపోయింది. స్వయంగా వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సీక్వెల్ 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని ప్రకటించేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లైమాక్స్ లో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరో ఉండే ఊరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు చూపించారు. సో.. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చినట్టే. అనిల్ దగ్గర ఒక పాయింట్ కూడా రెడీగా ఉందట. సో రెండు సంక్రాంతులకి కూడా అనిల్ రావిపూడి సినిమాలు రావడం ఖాయమన్న మాట.

‘సంక్రాంతికి వస్తున్నాం’ అక్కడ తక్కువ రేట్లకే ఇచ్చేశారా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus