Venkatesh: నానితో సినిమా… వెంకటేశ్‌ రియాక్షన్‌ ఏంటంటే?

విక్టరీ వెంకటేశ్‌… టాలీవుడ్‌లో ఇన్నాళ్లుగా ఉంటున్నా ఎక్కడా వివాదం దగ్గరకు పోని, ఆయన దగ్గరకు వివాదం రాని హీరో ఆయనొక్కరే అని చెప్పొచ్చు. ఎందుకు, ఎలా, ఏం చేస్తున్నారో తెలియదు కానీ… ఆయన మాత్రం వివాదరహితుడు అని చెప్పొచ్చు. అలాగే ఆయన స్వామి వివేకానంద ఫాలోవర్‌ కూడా. ఆయన మీద ఓ సినిమా కూడా చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి గురించి ఇటీవల ఆయన దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌లో ఇన్నాళ్లుగా ఉన్నా, 75 సినిమాలు చేసినా ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇదెలా సాధ్యమైంది అని అడిగితే… అదే విషయం నిజంగా తెలిసుంటే అందరికీ చెప్పేసేవాణ్ని అంటూ నవ్వేశారు (Venkatesh) వెంకీ. చిన్నప్పటి నుండీ ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదు అనే మనస్తత్వంతోనే పెరిగాను. స్కూల్‌, కాలేజీలో ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడు సినిమా పరిశ్రమలో కూడా అలానే ఉంటున్నాను. అందుకే వివాదాలకు నేను దూరం అని చెప్పాడు వెంకీ.

మరి మీరూ, నాని కలిసి ఓ సినిమా చేస్తారనే ఓ ప్రచారం జోరుగా సాగుతోంది నిజమేనా? అని అడిగితే.. అన్నీ చేసేద్దాం అంటూ మరోసారి తనదైన శైలిలో నవ్వేశారు. అలా సినిమా చేస్తారో లేదో క్లారిటీ ఇవ్వకుండానే విషయం తేల్చేశారు. మరి తదుపరి సినిమాలైనా చెబుతారా అంటే… రెండు మూడు కథలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. అయితే త్వరలో వాటి మీద నిర్ణయం తీసుకుంటాను అని తెలిపారు.

అలాగే తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘స్వామి వివేకానంద’ సినిమా స్క్రిప్ట్‌ ఒక స్థాయి వరకూ వచ్చిందని… అయితే ముందుకు కదలడం లేదు అని చెప్పారు. ఇక ఆయన నటించిన 75వ సినిమా ‘సైంధవ్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 13న రిలీజ్‌ చేస్తున్నారు. చిన్న పాపకు కోట్లు విలువ చేసే ఎమర్జెన్సీ ఇంజిక్షన్‌ చుట్టూ తిరిగే కథ ఈ సినిమా అని టీమ్‌ ఇప్పటికే చెప్పేసింది. ఆ అంశం చుట్టూ రాసుకున్న యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామా ఇది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus