విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘నారప్ప’.. అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో జూలై 20న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా.. ఈరోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో విక్టరీ వెంకటేష్ పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ‘అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయన్న గ్యారెంటీ లేదు. నేను హీరో అయినప్పటి నుండీ నచ్చి వెంటనే చేయాలి అని అనుకున్నానో.. అది చేశాను.
ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్లో నా సినిమా రిలీజ్ అవ్వడం పట్ల నాకు కొంత ఎక్సయిట్మెంట్ ఉన్నప్పటికీ మరో పక్క అభిమానులను బాధపెడుతున్నాను అనే గిల్ట్ ఫీలింగ్ ఉంది. అయితే మనం కాలంతో పాటు ముందుకు వెళ్ళాలి. ఆగి ఆలోచించుకుంటూ ఉంటే కష్టమైపోతుంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఆయన త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు ఉండొచ్చు అనే అంశం పై కూడా స్పందించారు. “కథ ఓకే అవ్వాలి.. ఊరికే చేసెయ్యాలి అంటే అయిపోదు కదా.
కథ ఫైనల్ అయినప్పుడు అది కచ్చితంగా జరుగుతుంది ఏమాత్రం లేట్ చేయను. ఇప్పుడే 3 సినిమాలు చేశాను. అది ఇంకా ఆనందంతో చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. గతంలో వెంకటేష్- త్రివిక్రమ్ ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్సుమెంట్ 2018 ఎండింగ్లో వచ్చిన సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంది. కానీ ఇది 3 ఏళ్ళైనా సెట్స్ పైకి వెళ్ళలేదు. కథ ఓకే కాకపోవడం వలెనే.. ఈ కాంబోలో మూవీ మొదలుకాలేదు అని వెంకీ స్పష్టంచేశారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్