ఈసారి ఫన్ మాములుగా ఉండదేమో!

ఈ మధ్యకాలంలో హీరోలంతా ప్రయోగాత్మక పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రవితేజ, రాజ్ తరుణ్ లాంటి హీరోలు అంధులుగా నటించారు. రామ్ చరణ్ చెవిటివాడిగా, ఎన్టీఆర్ నత్తి క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను బాగానే ఎంటర్టైనర్ చేశారు. ఇప్పుడు వీరి మాదిరిగానే సీనియర్ హీరో వెంకటేష్ కూడా ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘ఎఫ్ 2’ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ వస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం విభిన్నమైన పాత్రలు రాసుకున్నాడు అనీల్ రావిపూడి. ఈ కథలో హీరో వెంకటేష్ కి ”రే చీకటి” ఉంటుందట. అంటే సాయంత్రం ఆరు దాటితో కళ్లు కనిపించవన్నమాట. ఈ పాత్రతో మరింత ఫన్ క్రియేట్ చేయాలనేది దర్శకుడి ప్లాం. రీసెంట్ గా వెంకీపై రే చీకటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారట. సినిమాలో ఈ సన్నివేశాలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయని తెలుస్తోంది. వెంకీ లాంటి హీరో ఇలా రే చీకటి ఉన్న పాత్రలో చేయడం విశేషం. పైగా ఆయన కామెడీ టైమింగ్ కి ఈ రే చీకటి కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు.

గతంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ లాంటి హీరోలు రే చీకటి క్యారెక్టర్లలో కనిపించారు. ఆ సన్నివేశాలు ఇప్పటికీ ఆడియన్స్ ని నవ్విస్తాయి. ఇప్పుడు వెంకీ కూడా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో వెంకీకి జంటగా తమన్నా కనిపించనుంది. మరో హీరోగా వరుణ్ తేజ్ ఆయన సరసన మెహ్రీన్ నటిస్తోంది. సునీల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus