Sankranthiki Vasthunnam: ‘స్వాతిముత్యం’ మ్యూజిక్‌.. ‘కబడ్డీ కబడ్డీ’ కామెడీ.. ‘సంక్రాంతికి’ స్పెషల్ వీడియో!

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) అంటూ డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా చేయడమే కాదు.. సినిమా ప్రచారం కూడా అంతే డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి(Anil Ravipudi). ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలకు సంబంధించిన ప్రచారం, సినిమా రిలీజ్ డేట్‌ కోసం చేసిన వీడియో కూడా అదిరిపోయింది. ఇప్పుడు మూడో పాటకు సంబంధించి టీజర్‌ను కూడా అలానే ప్లాన్‌ చేశారు. అన్నీ సినిమా సెట్స్‌లో స్పాంటేనియస్‌గా చేసినవే అనిపిస్తున్నాయి కూడా. ఇక అసలు విషయానికొస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘సంక్రాంతి’ సాంగ్‌ ఒకటి ఉంది.

Sankranthiki Vasthunnam

దీనిని వెంకటేశ్‌ (Venkatesh) పాడారు అని కొన్ని రోజుల క్రితం మన సైట్‌లోనే చదివి ఉంటారు. దానికి సంబంధించిన ప్రోమోనే సినిమా టీమ్‌ రిలీజ్‌ చేసింది. అందులో అలనాటి క్లాసిక్‌ ‘స్వాతి ముత్యం’ సినిమాను, మంచి కామెడీ మూవీ ‘కబడ్డీ కబడ్డీ’ని వాడేశారు. అయితే ఆ రెండూ భలే సింక్‌ చేశారు అని చెప్పాలి. సినిమాలో మూడో పాటను ఎవరితో పాడిద్దాం అని అనిల్‌ రావిపూడి తన టీమ్‌తో అనుకుంటున్నప్పుడు, నిర్మాతతో అనుకుంటున్నప్పుడు, హీరోయిన్లతో మాట్లాడుతున్నప్పుడు..

ఇలా ఎక్కడున్నా సరే వెంకటేశ్‌ వచ్చి ‘నేను పాడతా’ అని అంటుంటారు. తొలుత వదిలేసిన అనిల్‌ రావిపూడి ఆయన బాధ భరించలేక సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియోకి (Bheems Ceciroleo)  చెప్పి పాడించేయమంటారు. ఇదంతా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనుకోండి. అంతేకాదు ‘స్వాతిముత్యం’ సినిమాలో ఉద్యోగం కోసం సోమయాజుల్ని కమల్‌ హాసన్‌ వెంటపడి నట్లు.. ‘కబడ్డీ కబడ్డీ’లో ఎమ్మెస్‌ నారాయణను చిన్నా కబడ్డీ కోసం వెంటపడినట్లు సీన్స్‌ రాసుకున్నారు అనిల్‌ రావిపూడి.

ఇవి నవ్వులు పూయించడంతోపాటు.. సినిమా హైప్‌ను కూడా భారీగా పెంచేశాయి అని చెప్పాలి. అయితే నిజ జీవితంలో వెంకీ చుట్టూ సినిమా టీమ్‌ పాట కోసం తిరిగింది అనేది మరో టాక్‌. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఎక్స్‌ పోలీసు, ఎక్స్‌ లవర్‌, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌ చుట్టూ తిరిగే కథ ఇది జనవరి 14న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు.

చర్చకు దారి తీసిన పూనమ్‌ కౌర్‌ వ్యాఖ్యలు.. దీనికి సమాధానం ఎవరు చెబుతారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus