ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఓరి దేవుడా సినిమాలో గెస్ట్ రోల్ లో నటించి ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వెంకటేష్ కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వెంకటేష్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే విక్టరీ వెంకటేష్ సినిమాలకు కొంతకాలం బ్రేక్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.
అధ్యాత్మిక సాధన నేపథ్యంలో వెంకటేష్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొంతకాలం బ్రేక్ తర్వాత వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. నాగార్జున ఇప్పటికే ది ఘోస్ట్ సినిమా తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలు వరుసగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. విక్టరీ వెంకటేష్ సినిమాలు వరుసగా సక్సెస్ సాధిస్తున్నా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు.
వెంకటేష్ నటించిన పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంపై కూడా అసంతృప్తి వ్యక్తమైంది. వెంకటేష్ ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వెంకటేష్ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.
వెంకటేష్ ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే ఛాన్స్ ఉన్నా వెంకటేష్ మాత్రం పరిమితంగానే రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!