Venkatesh: ఆ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ చేయాలని ఉంది: వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘సైందవ్’ అనే సినిమా రూపొందింది. ఈరోజు టీజర్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. చాలా కాలం తర్వాత వెంకటేష్ ను.. మాస్ అవతార్ లో చూపించాడు దర్శకుడు శైలేష్ కొలను. ఇక ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక టీజర్ రిలీజ్ వేడుకలో.. మీడియాతో ముచ్చటించారు వెంకటేష్.

ఈ క్రమంలో అతనికి ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటి అంటే.. ” ఒక్క ‘ఎఫ్ 3 ‘ లో తప్ప మీరు ఏ సీక్వెల్లోనూ నటించింది లేదు. ఒకవేళ మీ సినిమాల్లో దేనికైనా సీక్వెల్ చేయాలని అనుకుంటే ఏ సీక్వెల్ లో నటిస్తారు’ అనేది ఆ ప్రశ్న. దీనికి వెంకటేష్… ‘ నాకు ‘బొబ్బిలి రాజా’ సీక్వెల్లో నటించాలని ఉంది’ అంటూ బదులిచ్చాడు. వాస్తవానికి ‘బొబ్బిలి రాజా’ సీక్వెల్లో రానా హీరోగా నటించబోతున్నట్టు ప్రచారం జరిగింది. రామానాయుడు గారు బ్రతికున్న రోజుల్లో కూడా ‘రానా ‘బొబ్బిలి రాజా’ రీమేక్ లో నటిస్తే బాగుంటుంది’ అంటూ చెప్పుకొచ్చేవారు.

అయితే ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) నటించడమంటే.. అతనికి ఏజ్ కి ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ రెడీ అవ్వాలి. ‘బొబ్బిలి రాజా’ కి కథ అందించిన పరుచూరి బ్రదర్స్ కానీ దర్శకుడు బి.గోపాల్ కానీ ఇప్పుడు ఫామ్లో లేరు. మరి ఆ సీక్వెల్ స్క్రిప్ట్ ని రెడీ చేసి వెంకీని ఇంప్రెస్ చేయడం అంటే మాటలు కూడా కాదు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus