Venkatesh: మరో రీమేక్ లో వెంకటేష్..?

సీనియర్ హీరో వెంకటేష్ కు రీమేక్ సినిమాలంటే మక్కువ ఎక్కువ. ఆయన నటించిన చాలా రీమేక్ లు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నటిస్తోన్న ‘దృశ్యం 2’, ‘నారప్ప’ రెండూ కూడా రీమేక్ కథలే. ఇప్పుడు మరో రీమేక్ పై వెంకీ దృష్టి పడినట్లు తెలుస్తోంది. అదే ‘డ్రైవింగ్ లైసెన్స్’. రెండేళ్ల క్రితం మలయాళంలో విడుదలైన సినిమా ఇది. పృథ్వీ రాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది.

ఐదు కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.40 కోట్ల వసూళ్లను రాబట్టింది. చాలా కాలంగా ఈ సినిమాను తెలుగులో తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ లో నటిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఈ సినిమా వెంకీ చేతిలోకి వచ్చిందని సమాచారం. ఈ సినిమా రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ చేజిక్కించుకుందని సమాచారం. ఇందులో వెంకటేష్ నటించబోతున్నారని తెలుస్తోంది.

అయితే ఇది మల్టీస్టారర్ కథ కావడంతో.. వెంకీతో పాటు మరో హీరో కూడా కావాలి. అయితే ఆ హీరో ఎవరన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికైతే ‘డ్రైవింగ్ లైసెన్స్’ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా.. వెంకీ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారట. అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత రెండో హీరో ఎవరనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. చాలా కాలంగా వెంకీ, రానా మల్టీస్టారర్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో క్రేజీ కాంబోని సెట్ చేస్తారేమో చూడాలి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus