విక్టరీ వెంకటేష్ (Venkatesh) ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబడింది. దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే అనిల్ రావిపూడి చిత్రాలకు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఆయన గత సినిమాల సక్సెస్ బ్యాక్‌డ్రాప్‌లో సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.
వెంకటేష్ గతంలో ఎఫ్3 (F3 Movie) వంటి హిట్లతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా అదే పంథాలో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు స్వయంగా విడుదల చేయనుండగా, ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లో 20 కోట్లకల్ రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్ల లోపే ఉంది. సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఉండటంతో, టార్గెట్ కొట్టడం పెద్ద కష్టంగా అనిపించడం లేదు.
అలాగే దిల్ రాజు జెట్ స్పీడ్ లో టార్గెట్ ఫినిష్ అయ్యేలా మేజర్ సెంటర్లలో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. వీకెండ్ లోనే జెట్ స్పీడ్ లో టార్గెట్ ఫినిష్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈసారి సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer), డాకు మహరాజ్ (Daaku Maharaaj) వంటి భారీ చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో, సంక్రాంతికి వస్తున్నాం తనదైన ఎంటర్టైన్మెంట్‌తో ప్రత్యేకత సాధించబోతోందని యూనిట్ అంటోంది.
కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సినిమా కంటెంట్ రూపొందించారట. ఈ సినిమా విజయం సాధిస్తే, వెంకటేష్ మార్కెట్ మరింత పెరగడం ఖాయం. అలాగే అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయబోయే మెగాస్టార్ చిరంజీవి సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరనున్నాయి.