వెంకటేష్-నీరజల 35ఏళ్ల నాటి పెళ్లి ఫోటో..!

స్టార్ హీరో వెంకటేష్ ఫ్యామిలీ చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఉంటారు. వెంకటేష్ తన భార్యా పిల్లలను పబ్లిక్ వేడుకలకు తీసుకు రావడానికి ఇష్టపడరు. ఆయన సతీమణి నీరజతో పాటు నలుగు పిల్లలు కూడా బయట ప్రపంచానికి తెలిసింది తక్కువే. తన పెద్ద కుమార్తె పెళ్లి చేసే వరకు వెంకటేష్ కి పెళ్లీడుకి వచ్చిన కూతరు వున్న సంగతి తెలియదు. ఆయన తోటి హీరోలైన చిరు, నాగ్ మరియు బాలయ్య ఈ విషయంలో కొంచెం మెరుగనాలి.

నాగార్జున భార్య హీరోయిన్ గా అందరీకి తెలిసిందే. చిరు మరియు బాలయ్య భార్యలు వారి పిల్లలు కూడా అందరికీ తెలుసు. వెంకటేష్ మాత్రం తన భార్య పిల్లలు సెలెబ్రటీ లైఫ్ అనుభవించాలని కోరుకోరు. ఇక వెంకటేష్ పెళ్లి నాటి ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. దాదాపు 35ఏళ్ల నాటి ఆ ఫోటోలో, వెంకటేష్ ఆయన భార్య నీరజ చూడచక్కని జంటలా ఉన్నారు. 25ఏళ్ల వయసులో వెంకటేష్ పెళ్లి పీటలు ఎక్కారు.

అప్పటికి ఆయన ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. పెళ్ళైన ఏడాదికి అనగా 1986లో ఆయన కలియుగ పాండవులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో 75% శాతానికి పైగా సక్సెస్ రేట్ ఉన్న హీరో వెంకటేష్. అందుకే ఆయన విక్టరీని ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. గత ఏడాది ఎఫ్2, వెంకీ మామ చిత్రాలతో హిట్స్ అందుకున్న ఆయన ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప మూవీ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus