ఒకప్పుడంటే సినిమాలు యాభై రోజులు, వంద రోజులు ఆడేవి కానీ ఇప్పుడు సినిమాకి అంత లైఫ్ స్పాన్ ఉండడం లేదు. ఎంత మంచి టాక్ వచ్చిన సినిమా అయినా.. రెండో వీకెండ్ ని మించి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది. మొదటి వీకెండ్ లో మాగ్జిమమ్ కలెక్షన్స్ ను రాబట్టి.. ఆ తరువాత ఓ మోస్తరు కలెక్షన్స్ తో సాగుతుంటాయి కొత్త సినిమాలు. అయితే ఈ శుక్రవారం విడుదల కానున్న ‘సార్’ సినిమా తెలుగులో నాలుగైదు వారాలు ఆడుతుందని చెబుతున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి.
ముందుగా నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత ‘తొలిప్రేమ’ సినిమాతో దర్శకుడిగా మారారు వెంకీ అట్లూరి. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఆయన డైరెక్ట్ చేసిన ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా ‘సార్’. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు.
విడుదల దగ్గర పడ్డాక ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు కానీ.. మధ్యలో ఈ సినిమాను పట్టించుకోకుండా ఉండడం మైనస్ అయింది. ట్రైలర్ బాగానే అనిపించడంతో కాస్త బజ్ వచ్చింది. సినిమా రిజల్ట్ విషయంలో దర్శకుడు వెంకీ చాలా ధీమాగా ఉన్నట్లున్నారు. ‘సార్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకీ ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.
”నా తొలి సినిమా ‘తొలి ప్రేమ’ తరువాత మళ్లీ ఇప్పుడు ధీమాగా చెబుతున్నా.. ‘సార్’ సినిమా కేవలం ఫిబ్రవరి 17, 18, 19 తేదీల వరకు మాత్రమే కాదు.. నాలుగైదు వీకెండ్స్ బాగా ఆడుతుంది. తొలి వీకెండ్ లో మాదిరే ఆ తరువాత కూడా ఆడుతుంది. తమిళంలో అయితే ఈ సినిమా 8 వారాలు ఆడుతుంది. రాసిపెట్టుకోండి” అంటూ చెప్పుకొచ్చారు. వెంకీ ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే.. సినిమా రిజల్ట్ పై అంత నమ్మకంగా ఉన్నారనిపిస్తుంది. మరి రిజల్ట్ ఏమవుతుందో చూడాలి!
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!