‘వెంకీ మామ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 13న.. వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని.. మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్… నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 8.91 cr
సీడెడ్ 3.79 cr
ఉత్తరాంధ్ర 3.27 cr
ఈస్ట్ 1.85 cr
వెస్ట్ 1.15 cr
కృష్ణా 1.38 cr
గుంటూరు 1.85 cr
నెల్లూరు 0.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.35 cr
ఓవర్సీస్ 2.81 cr
వరల్డ్ వైడ్ టోటల్ 28.18 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 28.18 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, నాగ చైతన్య కెరీర్లో ఇవే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. గురువారం నాడు కూడా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం. అయితే ఈరోజు నుండీ ‘వెంకీమామ’ టఫ్ కాంపిటిషన్ మొదలు కాబోతుందనే చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 20న అంటే ఈరోజు.. ‘ప్రతీరోజూ పండగే’ ‘రూలర్’ ‘దొంగ’ ‘దబంగ్ 3’ వంటి క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని మామ ఎలా నిలబడతాడో చూడాలి..!

Click Here For VenkyMama Movie Review

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus