Venu Sriram: ఎక్కువ ఊహించుకోవద్దంటున్న వేణుశ్రీరామ్!

సాధారణంగా ఏ దర్శకుడైనా తన సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఓ రేంజ్ లో హైప్ వచ్చేలా చేస్తుంటారు. సినిమా అంచనాలను మించి ఉంటుందని చెబుతుంటారు. కానీ ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ మాత్రం ఎక్కువ ఊహించుకోవద్దని అంటున్నాడు. అయితే ఆయన చెప్పేది సినిమాలో ఉన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ గురించి. చాలా రోజులుగా ‘వకీల్ సాబ్’ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో పవన్ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

దీంతో దర్శకుడు వేణుశ్రీరామ్ ఆ సర్ప్రైజ్ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దని చెబుతున్నారు. తన సినిమాలో ఎలాంటి గెస్ట్ ఎప్పీయరెన్స్ లు లేవని.. ముందు ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని అన్నారు. తన సినిమాలో వేరే ఆర్టిస్ట్ లు ఎవరూ కనిపించరని అన్నారు. కానీ మ్యూజిక్ పరంగా ఓ చిన్న సర్ప్రైజ్ ఉంటుందని.. నిజానికి అది ట్విస్ట్ కూడా కాదని అన్నారు. ఇలా ‘వకీల్ సాబ్’ సర్ప్రైజ్ ఎలిమెంట్ పై పెరిగిపోతున్న అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశారు.

నిజానికి తనకు దాచిపెట్టే ఉద్దేశం లేదని.. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాలనుకున్నానని కానీ ఫ్యాన్స్ వద్దని చెప్పడంతో ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం.. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే ‘మగువ..మగువా’ సాంగ్ మళ్లీ సెకండాఫ్ లో వస్తుందని.. అయితే ఇప్పటివరకు వైరల్ అయిన మేల్ వెర్షన్ కాదని తెలుస్తోంది. ఫీమేల్ వెర్షన్ అని.. దాన్నే సెకండ్ హాఫ్ లో ప్లే చేస్తారని.. ఇదే సర్ప్రైజ్ ఎలిమెంట్ అని.. అంతకుమించి ఏం లేదని సమాచారం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus