Niharika, Chaitanya: నిహారిక – చైతన్య విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే చెప్పాడా?

అందరూ అనుకున్నట్టే జరిగింది మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుంది. చాలా కాలంగా ఈ విషయం పై ప్రచారం జరుగుతున్నా.. ఇవి గాసిప్స్ మాత్రమే అనుకుని జనాలు లైట్ తీసుకున్నారు. కానీ నిహారిక – చైతన్య విడివిడిగా ఉంటున్నారు అని ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తుండటంతో అందరిలోనూ కొద్దిగా అనుమానాలు మొదలయ్యాయి. ఇక నిన్న ఈ జంట విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే మే 19 నే వీళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకున్నట్లు స్పష్టమయ్యింది. ఫైనల్ గా నిహారిక,చైతన్య .. తమ సోషల్ మీడియా ద్వారా ఇది నిజమే అని పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళ విడాకులకు అది కారణం, ఇది కారణం అంటూ చాలా వార్తలు పుట్టుకొస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకి పెళ్లిళ్లు కలిసి రావడం లేదు అంటూ ఏంటేంటో కామెంట్లు పెడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే.. ఈ మధ్య ఊహించని సంఘటన ఏం జరిగినా…

దానికి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని ఇన్వాల్వ్ చేసే ఆనవాయితీ మొదలైంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిహారిక (Niharika) విడాకుల గురించి వేణు స్వామి గతంలోనే చెప్పినట్లు.. అతనికి రాధే శ్యామ్ లో విక్రమాదిత్య కి ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ ఇస్తున్నారు. నిహారిక పెళ్లి టైంలోనే వేణు స్వామి.. ఈ కామెంట్స్ చేసినట్టు చర్చించుకుంటున్నారు. అయితే వేణు స్వామి అంటే పడని వాళ్ళు.. ‘ఆయన జాతకం ఆయన చూసుకోవాలి ఫస్టు.

పెళ్ళై చాలా కాలం అవుతున్నా ఆయనకి సంతానం లేదు. ఆ విషయం గురించి ఫస్ట్ ఆయన్ని క్లారిటీగా చెప్పమనండి’ అంటూ అతని పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వేణు స్వామి చెప్పినవి ఒకటి రెండు నిజమైన సందర్భాలు ఉన్నాయి. కానీ మిగిలిన విషయాల్లో ఆయన చెప్పినవంటూ ఏమీ జరగలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ మధ్య ఈయన కూడా ఓ సెలబ్రిటీగా చలామణి అవుతున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus