Nayanthara, Vignesh: నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
- March 2, 2024 / 11:54 PM ISTByFilmy Focus
నయనతార విఘ్నేష్ శివన్ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆలస్యంగా నయన్ విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సరోగసి ద్వారా నయన్ తల్లయ్యారు. అయితే పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. నయనతార రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
అయితే నయన్ విఘ్నేష్ జాతకాలు కలవలేదని గతంలో వేణుస్వామి వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ నయనతారకు పెళ్లి అనేది అచ్చిరాదని ఆయన తెలిపారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఆమెకు ఏదో ఒక సమస్య వస్తుందని వేణుస్వామి పేర్కొన్నారు. నయనతార సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారని ఆయన వెల్లడించారు. పరిహారాలు ఉంటాయని వాటిని చేసుకోరని వేణుస్వామి పేర్కొన్నారు.

వేణుస్వామి అప్పట్లో నయనతార జాతకం గురించి చెప్పిన విషయాలు పెళ్లి తర్వాత నిజమవుతున్నాయి. అయితే నయన్ విఘ్నేష్ మధ్య విబేధాల గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి ఈ జంట నుంచి స్పష్టత రావాల్సి ఉంది. నయనతార ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. తెలుగు నుంచి కూడా నయన్ కు మూవీ ఆఫర్లు అయితే వస్తున్నాయని తెలుస్తోంది.

విఘ్నేష్ శివన్ మాత్రం నయనతార పోస్ట్ ల గురించి, ఆమె అన్ ఫాలో చేయడం గురించి, వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించలేదు. నయన్ విఘ్నేష్ విడిపోకూడదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నయనతార అన్ ఫాలో చేయడం గురించి నయన్ విఘ్నేష్ సన్నిహితులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నయన్ విఘ్నేష్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నయన్ విఘ్నేష్ గురించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. విఘ్నేష్ కెరీర్ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులే నయన్ విఘ్నేష్ మధ్య సమస్యలకు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.














