Adipurush: ఆదిపురుష్ ఫలితంపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

  • June 10, 2023 / 06:08 PM IST

ప్రభాస్, కృతిసనన్ కాంబినేషన్ లో ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాకు ఆదివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ ఫలితం గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. వేణుస్వామి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ప్రభాస్ జాతకరిత్యా ఆదిపురుష్ (Adipurush) మూవీ సంచలనాలు సృష్టించే అవకాశం అయితే లేదని వేణుస్వామి అన్నారు. బాహుబలి స్థాయి హిట్ ను ఆశించవద్దని ఆయన పేర్కొన్నారు. ఆదిపురుష్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని వేణుస్వామి కామెంట్లు చేయడం గమనార్హం. ఆదిపురుష్ మూవీ త్రీడీలో తెరకెక్కినా పిల్లలు యాక్సెప్ట్ చేసినంత మాత్రాన సూపర్ హిట్ కాదని ఆయన కామెంట్లు చేశారు.

జాతకంలో యోగాలు ఉండాలని వేణుస్వామి చెప్పుకొచ్చారు. శాకుంతలం సినిమాను రాజమౌళి తీసి ఉంటే ఆస్కార్ వచ్చేదని ఆయన తెలిపారు. రాజమౌళి చేసిన విధంగా సినిమాను మార్కెటింగ్ ఎవరూ చేయరని వేణుస్వామి చెప్పుకొచ్చారు. పది పైసల విషయాన్ని 100 రూపాయలుగా కన్వర్ట్ చేయగల శక్తి జక్కన్నకు ఉందని ఆయన తెలిపారు. రాజమౌళి జాతకం అలా ఉందని వేణుస్వామి వెల్లడించారు. రాజమౌళి పేరు వేసినా కొన్ని సినిమాలు హిట్ అవుతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభాస్ సినిమాకు 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని వేణుస్వామి వెల్లడించారు. తారకరత్న మరణాన్ని ముందే ఊహించానని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్లు పుట్టినరోజు విషయంలో ఇయర్ తప్పు చెబుతారని వేణుస్వామి వెల్లడించారు. 2026లోపు ఒక హీరో ఆత్మహత్య చేసుకుంటాడని మరో హీరో ఆరోగ్యపరమైన సమస్యలతో చనిపోతారని ఆయన పేర్కొన్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus