Venu, Puri: అల్లు అర్జున్ సినిమా నేను చేయాల్సింది: వేణు తొట్టెంపూడి

ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు వేణు తొట్టెంపూడి చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో వేణు మళ్లీ వెండితెరపై సందడి చేయబోతున్నారు. సీఐ మురళి పాత్రలో వేణు కనిపించబోతోన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు వేణు. రీసెంట్ గా ఈ నటుడు అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు.

చాలా కాలంగా వేణు తొట్టెంపూడిని ఈ షోకి గెస్ట్ గా తీసుకురండి అంటూ ప్రేక్షకులు అడుగుతున్నారు. ఫైనల్ గా వేణు రాకతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు వేణు. తనను మొదటగా స్క్రీన్‌కు పరిచయం చేయాల్సింది భారతీ రాజానే అని, కానీ మిస్ అయిందంటూ తెలిపారు. మొదటిసారి వేణుని చూసినప్పుడు చాలా వినయంగా ప్రవర్తించాడని.. ఏంటి ఇంత నటిస్తున్నాడని అనుకున్న విషయాన్ని వెల్లడించారు అలీ.

అయితే అలీగారు తనని వేలు పట్టుకుని నడిపించాడని, ఈ షర్ట్ కూడా తనదే అంటూ వేణు కామెడీ చేశారు. ఫ్రెండ్ ఇంటికెళ్లి చదువుకుంటానని చెప్పి.. వెళ్లి సినిమాలు చూసుకుంటూ ఉండేవాడినంటూ.. ఆ విషయం తన తండ్రికి తెలిసి బెల్ట్ తో కొట్టేవారని గుర్తుచేసుకున్నారు వేణు.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథ ఏంటి..? అని అలీ ప్రశ్నించగా.. ” ఆ సినిమా చేయకపోయినా కూడా పూరి జగన్నాథ్ గారు మళ్లీ వచ్చారు. అల్లు అర్జున్‌తో చేసిన దేశ ముదురు సినిమాలో హీరో అన్నాడు.. హీరో క్యారెక్టర్ యాంకర్ అని.. అన్నీ కవర్ చేస్తాడని అన్నీ బాగానే చెప్పాడు..కానీ చివరకు సినిమాను నాతో చేయలేదు” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus