సినీ పరిశ్రమలో విషాదం.. హీరో తండ్రి కన్నుమూత!

సినీ పరిశ్రమని విషాదాలు వీడటం లేదు. గతేడాది శరత్ బాబు , కె.విశ్వనాథ్, చంద్ర మోహన్ వంటి దిగ్గజాలను కోల్పోయాం. కొత్త ఏడాదిలో కూడా బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. ఈ మధ్యనే నిర్మాత ఎస్.కె.ఎన్ తండ్రి మరణించారు. అలాంటి షాక్…ల నుండీ సినీ పరిశ్రమ కోలుకోకుండానే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఒక సీనియర్ హీరో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ హీరో వేణు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

అతని తండ్రి, ప్రొఫెసర్ అయిన తొట్టెంపూడి వెంకట సుబ్బారావు ఈరోజు అనగా 29.01.2024 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్ధం హైదరాబాద్, శ్రీనగర్ కాలనీ, స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్, నందు ఉంచారు. వేణు బంధువులు, ఇండస్ట్రీలో ఉన్న అతని స్నేహితులు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇక అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల నుండి జూబ్లీహిల్స్, మహాప్రస్థానం లో నిర్వహించబోతున్నారు.

వేణు (Venu Thottempudi) 2022 లో వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అది పెద్దగా ఆడలేదు కాబట్టి.. ఇతని సెకండ్ ఇన్నింగ్స్ కి మైలేజ్ అందలేదు. గతేడాది ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. వేణు నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి. అలాగే త్వరలో మరో వెబ్ సిరీస్ తో అతను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus