9 ఏళ్ళ గ్యాప్ తర్వాత సీనియర్ హీరో తొట్టెంపూడి వేణు ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకుడు. ఈ చిత్రంతో వేణుకి మంచి రీ ఎంట్రీ లభిస్తుంది అని భావిస్తున్నాడు. సినిమా పై కూడా పాజిటివ్ బజ్ ఉంది. ఇతను ప్రమోషన్లలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు. అంతేకాదు ఇతను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలు ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘దేశముదురు’ వంటివి తనతో చేయాల్సిన సినిమాలు అని.. కానీ అవి మిస్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇక ‘దమ్ము’ సినిమాలో తన పాత్ర ‘షోలే’ లో అమితాబ్ రేంజ్లో ఉంటుందని చెప్పి దర్శకుడు తనని మోసం చేసినట్టు కూడా పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో ‘అతడు’ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు తెలిపాడు వేణు.
ఓ ఇంటర్వ్యూలో అతనికి… ‘మీ చిత్రాలకు త్రివిక్రమ్ గారు రైటర్ గా పనిచేశారు చేశారు. తర్వాత ఆయన స్టార్ దర్శకుడయ్యారు.మరి ఆయన సినిమాల్లో ఏదైనా పాత్రల కోసం మిమ్మల్ని ఆయన సంప్రదించలేదా?’ అనే ప్రశ్న అతనికి ఎదురైంది. ఇందుకు వేణు సమాధానమిస్తూ.. ‘త్రివిక్రమ్ గారి సినిమాల్లో నాకు సరిపడే పాత్ర ఉంటే ఖచ్చితంగా నాతో చెప్తారు. ‘అతడు’ సినిమాలో సోనూసూద్ పాత్ర ముందుగా నాకే చెప్పారు.
నేను చేయకపోతే తర్వాత సోను సూద్ చేశారు. ‘ఈ పాత్రకి వేణు బాగుంటాడని’ ఆయనకు అనిపిస్తే తప్పకుండా నాతో చెప్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. వేణు తెలిసి చేశాడో తెలీక చేశాడో కానీ.. ఆ పాత్ర అతను చేయకపోవడమే మంచిదైంది. అలాంటి కన్నింగ్ పాత్రకి వేణు సూట్ అవ్వకపోవచ్చు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!