సరిగ్గా మరో రెండునెలల్లో.. అంటే ఏప్రిల్ 28 న బాహుబలి కంక్లూజన్ థియేటర్లో హడావుడి చేయనుంది. ఆ డేట్ బాహుబలి చూసిన ప్రతి ఒక్కరికి గుర్తే. ఏ ప్రచారం చేయకపోయినా ఆరోజు అభిమానుల అడుగులు సినిమా హాల్స్ వైపు వెలుతాయి. అంత హైప్ వచ్చిందికదాని చేయవలిసిన వేడుకలను రాజమౌళి ఆపరు. ఫస్ట్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చే నెలల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆడియో వేడుక.. ఆ విషయంపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బాహుబలి బిగినింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను తిరుపతిలో నిర్వహించారు. బాహుబలి 2 ఆడియో వేడుకను వైజాగ్ లో నిర్వహించాలని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని భావిస్తున్నారు.
అయితే తొలి పార్ట్ ఆడియో తిరుపతిలో చేశారు.. అందుకే ఆ చిత్రం ఘన విజయం సాధించింది.. రెండో పార్ట్ కూడా అక్కడే నిర్వహిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు నిర్మాతలకు సూచించారంట. దీనిపై దర్శకధీరుడు ఇంకా ఏమి స్పందించలేదని తెలిసింది. సెంటిమెంట్ ని ఫాలో అవుతూ తిరుపతిలో చేయడానికి ఆసక్తి కనబరుస్తారా? చిత్రంపై నమ్మకంతో వైజాక్ లో చేయడానికి ఒకే చెబుతారా? అనే విషయంపై జక్కన్న మాట కోసం నిర్మాతలు, చిత్ర బృందం ఎదురుచూస్తోంది. వేదిక ఏదైనా.. పాటలు వినాలని అభిమానులు మాత్రం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆ శుభవార్త త్వరలో వెలువడనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.