Jr NTR: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. వేణుస్వామి ఏమన్నారంటే?

తెలంగాణలో ఇటీవల ఎన్నికలు పూర్తికావడంతో అందరి దృష్టి ఏపీ రాష్ట్ర రాజకీయాలపైనే ఉంది. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేయడమే కాకుండా జనసేన పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గతంతో పోలిస్తే మెరుగ్గానే ఉండగా వైసీపీ పార్టీని ఢీ కొట్టాలి అంటే తెలుగుదేశం పార్టీలో కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఉండాలని భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వైసిపిని ఢీ కొట్టాలి అంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తే సాధ్యమవుతుందని పలువురు తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భావిస్తున్నా ఈయన మాత్రం రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తనకు రాజకీయాలు వద్దని సినిమాలు తనకు ముఖ్యం అంటూ వరుస సినిమాలకు కమిట్ అవుతూ తన సినిమా పనులలో బిజీ అవుతున్నారు. కానీ ఈయన రాజకీయాలలోకి వస్తే సక్సెస్ అవుతారని అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ జీవితం గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి చేసినటువంటి కామెంట్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా వేణు స్వామి ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఇప్పుడు అప్పుడే రాజకీయాల్లోకి రారని ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని తెలిపారు. కానీ ఎన్టీఆర్ జాతకంలో రాజకీయ యోగం ఉందని వేణు స్వామి తెలిపారు.

ఈయన జాతకం ప్రకారం 2030లో ఈయనకు రాజకీయ యోగం ప్రారంభమవుతుందని ఆ సమయంలో కనుక ఈయన రాజకీయాలలోకి వస్తే మంచి సక్సెస్ అవుతారని వేణు స్వామి ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి వేణు స్వామి చెప్పిన విధంగానే అప్పటి వరకు ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటారా లేకపోతే తెలుగుదేశం పెద్దల ఆహ్వానం మేరకు రాజకీయాలలోకి వస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus