Jr NTR: ఎన్టీఆర్ సీఎం అవుతాడంటున్న వేణుస్వామి!

ప్రస్తుతం సినిమాల పరంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ఎన్టీఆర్ మార్కెట్ ను పెంచుకోవాలని భావిస్తున్నారు. 2023 సంవత్సరం వరకు ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తారక్ రాజకీయాల్లో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నా ఎన్టీఆర్ మాత్రం పాలిటిక్స్ గురించి అస్సలు స్పందించకపోవడం గమనార్హం. అయితే ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి ఎన్టీఆర్ జాతకం గురించి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తెలుగుదేశంకు ఉన్న గెలుపు మార్గం ఎన్టీఆర్ మాత్రమేనని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉందని వేణుస్వామి పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితమే తాను ఈ మాటను చెప్పానని చంద్రబాబు, లోకేష్ వల్ల టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని వేణుస్వామి తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కు జాతకం ప్రకారం సీఎం అయ్యే యోగం కూడా ఉందని వేణుస్వామి వెల్లడించారు. జయలలిత నక్షత్రం, జూనియర్ ఎన్టీఆర్ నక్షత్రం ఒకటేనని ఈ నక్షత్రం వల్ల తారక్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే తారక్ కు తిరుగుండదని వేణుస్వామి అన్నారు. బాలయ్య జాతకాన్ని పరిశీలిస్తే ఆయనకు సీఎం అయ్యే యోగం లేదని వేణుస్వామి వెల్లడించారు. మరి ఎన్టీఆర్ పాలిటిక్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ రాజకీయాల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తారక్ రాజకీయాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus