SSMB29: మొన్న పృథ్వీ అన్నారు.. ఇప్పుడు మరో హీరో.. మహేష్‌ విలన్‌ ఎవరు?

మహేష్‌బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli)  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల క్రితమే ఓకే అయిన ఈ సినిమా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినిమాలో నటించేది ఎవరు? అనే చర్చ నడుస్తోంది. హీరో మాత్రమే అఫీషియల్‌గా ఫిక్స్‌ అయిన ఈ సినిమాకు సంబంధించి రోజుకో పుకారు బయటకు వస్తోంద. మొన్నీమధ్య వరకు హీరోయిన్లకే పరిమితమైన ఈ పుకార్లు ఇప్పుడు విలన్‌ వరకు వచ్చాయి.

రాజ‌మౌళి – మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో రూపొందే సినిమా కోసం అభిమానులు ఎప్ప‌టి నుండో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరో స్టార్‌ హీరో అభిమానులు కూడా ఎదురుచూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఓ స్టార్‌ హీరోను అనుకుంటున్నారని సమాచారం. ఫృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ఇన్నాళ్లూ ప్ర‌చారం జరుగుతోంది. ఇప్పుడు మరో హీరో పేరు చర్చలోకి వచ్చింది.

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా పుకార్లు వచ్చినా టీమ్‌ నుండి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఏదీ నమ్మలేకపోతున్నాం. అలా నమ్మశక్యం కాని మరో విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా చియాన్‌ విక్రమ్‌ను (Vikram) అనుకుంటున్నారని టాక్‌. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఏదో ఒకటి తేలుస్తారని చెబుతున్నారు. మరి ఈ విషయం పృథ్వీరాజ్‌ పుకారులా ఆగిపోతుందా? లేక కంటిన్యూ అయి ఓకే అవుతుందా అనేది చూడాలి.

ఈ సినిమా కోసం ఇండోనేషియా నుండి చెస్లా అనే హీరోయిన్‌ని తీసుకొస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఆమె దాదాపు ఫిక్స్‌ అంటున్నారు కానీ.. ఇంకా క్లారిటీ లేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ సినిమా ముహూర్తం కూడా అయిపోయేది. అయితే ఎందుకో కానీ వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పుడు సమాచారం చూస్తే.. ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనేది తెలియడం లేదు. ఈ నెలాఖరులోగా క్లారిటీ రావొచ్చని టాక్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus