శ్రీదేవి సోడా సెంటర్ లో నా పాత్ర ని చూసిన కృష్ణ గారు నాకు ఫోన్ చేయటం నా కళ్ల లో కన్నీళ్లు తెప్పించాయి -సీనియర్ యాక్టర్ నరేష్

సుధీర్ బాబు, ఆనంది జంటగా 70 mm ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమా విడుదల అయిన రోజు నుంచి మంచి ప్రేక్షక ఆదరణ పొందుతుంది. ఈ మూవీ లో హీరోయిన్ కి తండ్రి పాత్ర పోసించిన సీనియర్ యాక్టర్ నరేష్ మీడియా తో ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించినందుకు చాలా సంతోషం గా వుంది, చాలా సినిమాల లో తండ్రి పాత్రలు పోసించిన ఈ మూవీ లో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండి నాకు చాలా మంచి పేరు తెచ్చింది.

-కృష్ణ గారు ఈ మూవీ చూసి నాకు ఫోన్ చేశారు, ని పాత్ర నాకు చూసినంతసేపు నాకు కళ్ళలో కన్నీరు తెప్పించింది, నువ్వు సుదీర్ బాబు ఈ మూవీ లో ఎక్కువ భాగం సినిమా సక్సెస్ కు తోడ్పడ్డారు, ఆరోజు కృష్ణ గారి తో పాటు మంజుల, సుదీర్ బాబు భార్య, జయ దేవ్ భార్య పద్మ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఉండి అందరు ఫోన్ లో మాట్లాడారు, అందరు నాతో చాలా బాగా చేసారు అని చెప్పగానే నాకు చాలా సంతోషం గా అనిపించింది అన్నారు.

-సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ చూసి ట్విట్ చేయటం చాలా మంచి పరిణామం, మహేష్ సినిమా బాగోకపొతే అసలు ట్విట్ చేయరడు అంత పెద్ద హీరో సినిమా బావుంది అని చెప్పటం శుభ పరిణామం,

-మా సుదీర్ బాబు గురించి చెప్పాలంటే ఈ జనరేషన్ లో చాలా కష్టపడే హీరో,క్లైమాక్స్ లో సుదీర్ నా మొహం మీద ఉమ్ము ఊసే సీను లో చాలా ఇబ్బంది పడ్డాడు అప్పుడు నువ్వు ఉమ్ము ఊసేది నా క్యారెక్టర్ మీద అని చెప్పను,అయినా కానీ సుదీర్ నా వల్ల కాదు అన్నాడు అప్పుడు సైడ్ కి పెట్టి చేయించాము, సుదీర్ కి ఈ మూవీ నటుడి గా ఒక మెట్టు పెంచుతుంది.

-హీరోయిన్ నందిని క్యారెక్టర్ చాలా మంది మహిళల కు కనెక్ట్ అయ్యింది, ఒక తండ్రి కూతురు కన్నా కులం గొప్పది అనే అపోహలో వున్న తండ్రి కి ఈ జనరేషన్ లో వున్న అమ్మాయి గా అందరకి బాగా చేరువయింది. ఈ మూవీ డైరెక్టర్ కరుణ నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను,కరుణ పలాస కమర్షియల్ గా హిట్ కాకపోయినా మంచి ప్రజాదరణ పొందింది, కరుణ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు,మంచి భవిష్యత్తు వుంది కరుణ కి అని చెప్పారు.

-ఈ మూవీ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు,ఈ మూవీ పాటలు సినిమా రిలీజ్ కి ముందే చాలా పెద్ద సక్సెస్ అయ్యాయి,ఇంక ఈ మూవీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పనవసరం లేదు అందులో మణిశర్మ గారు సిద్దహస్తుడు.

-ఈ మూవీ ప్రొడ్యూసర్స్ 70mm బ్యానర్ విజయ్ చిల్ల,శశి దేవి రెడ్డి మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, డి. రామానాయుడు తరువాత అంత మంచి అభి రుచి వున్న ప్రొడ్యూసర్స్, ఆయన అంత స్థాయి కి 70mm వాళ్ళు చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను అని చెప్పారు.

-నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలి అంటే టక్ జగదీశ్ లో చాలా మంచి క్యారెక్టర్ చేశాను, నితిన్ మాస్ట్రో రిలీజ్ కి సిద్ధంగా వుంది, అమర్రాజా వాళ్ళది అశోక్ గల్లా తో ఒకటి చేస్తున్నాను, ఇంకా కొన్ని ఫైనల్ స్టేజ్ లో వున్నాయి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus