ఈ మధ్య సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు వరుసగా మరణిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా మరో నటుడు, దర్శకుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..ప్రతాప్ పోతెన్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.చెన్నైలో ఉన్న ప్రతాప్ పోతెన్ నివాసంలో ఆయన మరణించినట్లు తెలిసింది. ఆయన వయసు 69 సంవత్సరాలు.ఆయన చివరగా మమ్ముట్టి హీరోగా రూపొందిన ‘సీబీఐ 5 ది బ్రెయిన్’ అనే చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈయన తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో కలుపుకుని మొత్తం 100 కి పైగా సినిమాల్లో నటించారు.
కేరళలో జన్మించినప్పటికీ తమిళనాడు లో సెటిల్ అయ్యారు. ఈయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. 1985వ సంవత్సరంలో వీరు వివాహ బంధంతో ఒకటయ్యారు.కానీ ఏడాదిలోపే అంటే 1986 లో విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత ఆయన అమల సత్యనాద్ అనే మరో మహిళను వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఓ కుమార్తె ఉంది. 22 ఏళ్ళ తర్వాత ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు ప్రతాప్.
తెలుగులో నాగార్జున నటించిన ‘చైతన్య’ చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రతాప్ పోతెన్. 1991 లో ఆ చిత్రం రిలీజ్ అయ్యింది. కానీ ఆ మూవీ సక్సెస్ అందుకోలేదు.అందుకే తెలుగులో ఈయన దర్శకుడిగా కొనసాగలేకపోయారు. సిద్దార్థ్ నటించిన ‘చుక్కల్లో చంద్రుడు’ చిత్రంలో కూడా ఇతను నటించాడు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!