సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు.పేరుగాంచిన నటీనటులు దర్శకులు, నిర్మాతలు, సింగర్స్, రైటర్స్ .. లేదు అంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. ఇప్పటికే దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్, సీరియల్ నటి పవిత్ర జయరాం, మరో సీరియల్ నటుడు చందు, దర్శకుడు సూర్య ప్రకాష్, రైటర్ శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు, విలన్ డేనియల్ బాలాజీ, హీరోయిన్ అమృత పాండే, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సింగర్ సింగ్ ఉమా రామనన్ వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటి కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటి స్మృతి బిశ్వాస్ కన్నుమూసింది. మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న ఆమె నివాసంలోనే చివరి శ్వాస విడిచినట్టు తెలుస్తుంది. వృద్ధాప్య సమస్యల కారణంగానే ఈమె కన్నుమూసినట్టు సమాచారం. హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈమె అనేక చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది.
స్మృతి బిశ్వాస్ 1930 లో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈమె ‘నేక్ దిల్’, ‘అపరాజిత’, ‘మోడరన్ గర్ల్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.మొత్తంగా 90 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిందట. ఈమె వయసు 100 ఏళ్ళు అని స్పష్టమవుతుంది. ఈమె మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.