‘చోర్‌ బజార్‌’తో ఎంట్రీ ఇస్తున్న అలనాటి నాయిక

అలనాటి కథానాయికల్ని… తిరిగి తల్లిగా, అత్తగా మార్చి మెరిపిస్తున్నారు మన దర్శకులు. అలా ఇటీవల కాలంలో చాలామంది దర్శకులు ప్రయత్నాలు చేసి వావ్‌ అనిపించారు. అదే సమయంలో ఆ నాయికలు కూడా అదరగొట్టారు. తాజాగా ఇలా తన నటనతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు అర్చన. ఇలా అంటే అంత ఈజీగా తెలియకపోవచ్చు నేటి తరానికి. ‘నిరీక్షణ’ అర్చన అంటే ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే ఆ సినిమాను నేటి తరం యువత కూడా చూసే ఉంటుంది కాబట్టి. అవును 25 ఏళ్ల తర్వాత అర్చన తెలుగులోకి వస్తున్నారు.

అర్చన అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమాలు… ‘నిరీక్షణ’, ‘భారత్ బంద్’, ‘లేడీస్ టైలర్’. ఇంకా చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఇవి ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘వీడు’ అనే చిత్రానికి జాతీయ అవార్డు వ‌చ్చింది. ఇప్పుడు ఆకాష్ పూరి సినిమా ‘చోర్ బజార్’తో అర్చన వెండితెరపై కనిపించనున్నారు. గెహన సిప్పీ నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినమాలోనే అర్చ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ముందుగా చెప్పినట్లు ఆమె ఓ తెలుగు సినిమాలో క‌నిపించి సుమారు పాతికేళ్ల‌య్యింది. గత కొంతకాలంగా ఆమెను తిరిగి తెలుగు సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినా అవి ఫలితంచలేదు. ఎట్టకేలకు జీవన్‌ రెడ్డి ఆ పని చేయగలిగాను. పాత బ‌స్తీ నేప‌థ్యంలో సాగే క‌థ ఈ ‘చోర్ బ‌జార్‌’. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినమా త్వరలో విడుదల కానుంది. ‘చోర్‌ బజార్’ సినిమా గురించి మేనేజర్‌ నా వెంటపడి మరీ కథ వినడానికి ఒప్పించాడు.

దర్శకుడు స్క్రిప్ట్‌ చెప్పాక బాగుందనిపించింది అని గతంలో ఓ సందర్భంలో చెప్పారు అర్చన. ఈ మధ్య కాలంలో అంతమంచి కథ ఏ భాషలోనూ వినలేదన్నారామె. దాంతో పాటు ఆ దర్శకుడి యాటిట్యూడ్‌ నచ్చి సినిమా ఓకే చేశానన్నారు. కొవిడ్ తర్వాత ఎప్పుడు సినిమా మొదలైనా, నేను ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా ఆ సినిమా చేస్తాను అని చెప్పారామె. అది నా బాధ్యత.. దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే స్క్రిప్ట్‌ మహిమ అది అని చెప్పారు అర్చన.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus