కళకు భాష లేదు. సరిహద్దులు లేవు అని పలువురు అంటుంటారు. కానీ, కళలకు ఖచ్చితంగా భాష, సంస్కృతి, హద్దులు ఉంటాయి. కళలను ఆస్వాదించే ప్రేక్షకులకే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం కంటే మన నేటివిటీతో తీసే చిత్రాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ఆస్కార్ అవార్డు కంటే గొప్ప విషయమని జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ అన్నారు. తాజాగా చెన్నై నగరంలో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్ జరిగింది. ఈ మీట్‌లో దర్శకుడు వెట్రిమారన్ నేటివిటీ చిత్రాలపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా వెట్రిమారన్ మాట్లాడుతూ.. ‘‘కళకు భాష లేదు. సరిహద్దులు లేవు అని పలువురు అంటుంటారు. కానీ, కళలకు ఖచ్చితంగా భాష ఉంది. సంస్కృతి వుంది. హద్దులు ఉంటాయి. కళలను ఆస్వాదించే ప్రేక్షకులకే సరిహద్దులు లేవు. వీరు సరిహద్దులను చెరిపేశారు. ఈ విషయం కరోనా మహమ్మారి సమయంలో చూశాం. ఇకపోతే, ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం కంటే.. మన ప్రజలు, సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కే చిత్రాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు.
ఇటీవలికాలంలో దక్షిణాది చిత్రాలు దేశ చలనచిత్ర పరిశ్రమలో పెను ప్రభావాన్ని చూపించాయి. దానికి కారణం… స్థానిక ప్రజలు, స్థితిగతులు, మన భూమితో మిళితమైన కథలను చెప్పడమే. మన గుర్తింపు, ప్రత్యేకతలతో సినిమాలు తీయడమే ఈ ప్రభావానికి కారణంగా భావిస్తున్నారు. ఇదే హవా మున్ముందు కూడా కొనసాగాలి’’ అని వెట్రిమారన్ పిలుపునిచ్చారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై..
ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాని వెట్రిమారన్ తెరకెక్కించిన తీరుపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. సూరి, విజయ్ సేతుపతి ఇందులో ప్రధాన పాత్రలలో నటించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?