నారప్పని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారా..?

విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో కలిసి చేస్తున్న సినిమా నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకి ఇది రీమేక్ గా తెలుగులో రాబోతోంది. తెలుగులో వెంకటేష్ కి జోడీగా ప్రియమణి నటిస్తోంది. ఇప్పుడు ఈసినిమాని మే 14వ తేదిన విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈసినిమాని పోస్ట్ పోన్ చేయబోతున్నారా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. నారప్పని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

దీనికి ప్రధానంగ్ రెండు కారణాలు చెప్తున్నారు. మొదటిది ఒక్కరోజు ముందు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా వస్తోంది. థియేటర్స్ ఆక్యూపెన్సీ ఎక్కువగా ఉండే సినిమా అది. అందుకే, ఒక్కరోజు గ్యాప్ లో మరో పెద్దహీరో సినిమాని రిలీజ్ చేయరు. ఎంత సమ్మర్ హాలీడేస్ ఉన్నా, థియేటర్స్ దొరకడం అనేది కష్టం అవుతుంది. మరో రీజన్ ఏంటంటే, మే నెలలో వచ్చిన వెంకటేష్ సినిమాలు పెద్దగా ఆడలేదు. హిందీలో అనార్, తక్ ధీర్ వాలా సినిమాలు మే నెలలోనే రిలీజ్ అయ్యాయి. అయితే, వెంకటేష్ కి జూన్ జూలై రెండు నెలలు బాగా కలిశొస్తాయి.

గతంలో వెంకటేష్ యాక్ట్ చేసిన సినిమాలు జూన్ నెలలో వచ్చినవి మంచి హిట్స్ కూడా అయ్యాయి. కొండపల్లిరాజా, కూలీ నెంబర్ వన్, ఘర్షణ, వసంతం, దృశ్యం ఈ సినిమాలు అన్నీ జులై నెలలో రిలీజై బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి . అందుకే సినిమాని జులైకి పోస్ట్ పోన్ చేస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇలా మే నెల సెంటిమెంట్ చూస్కుంటే మాత్రం ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా వాయిదా పడే ఛాన్సులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus