NBK107: వైరల్ అవుతున్న బాలయ్య మూవీ సాంగ్ వీడియో.. అదుర్స్ అంటూ?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. గతంలో కర్నూలు, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగగా ఆ సమయంలో జై బాలయ్య సాంగ్ కు సంబంధించిన క్లిప్స్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ లీక్ కావడం గమనార్హం. సుగుణ సుందరి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు సంబంధించిన కొన్ని సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లీకైన వీడియోలో బాలయ్య స్టెప్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. టర్కీ షెడ్యూల్ లో ఈ సాంగ్ షూట్ జరగగా చిత్రయూనిట్ కు సంబంధించిన వాళ్లే ఈ సాంగ్ ను లీక్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమా నుంచి వరుసగా ఫోటోలు, వీడియోలు లీకవుతూ ఉండటం ఫ్యాన్స్ ను కంగారు పెడుతోంది. బాలయ్య107 సినిమాకు సంబంధించి ఎలాంటి ఫుటేజ్ లీక్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు సూచిస్తున్నారు.

అఖండ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చి ప్రశంసలు అందుకున్న థమన్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 70 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. డిసెంబర్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. లీకైన వీడియో ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతోంది.

గోపీచంద్ మలినేని సినిమాతో అఖండ సినిమాను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటానని బాలయ్య భావిస్తున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus