కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘విడుదల'(మొదటి భాగం) డీసెంట్ టాక్ ను సంపాదించుకుంది. వెట్రిమారన్ (Vetrimaaran) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కొనసాగింపుగా రెండో భాగం ‘విడుదల 2’ (Vidudala Part 2) పేరుతో ఈ శుక్రవారం నాడు అంటే డిసెంబర్ 20న రిలీజ్ అయ్యింది.మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి భాగం చాలా బాగుందని, దాంతో పోల్చి చూస్తే ఈ సినిమాలో ఏమీ లేదని, సెకండాఫ్ తేలిపోయిందని అంతా అంటున్నారు.
దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి (Vidudala Part 2) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.12 cr |
సీడెడ్ | 0.05 cr |
ఆంధ్ర(టోటల్) | 0.10 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.27 cr |
‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే రెండు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.27 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.3.23 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే తమిళంలో బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి. తెలుగులో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ‘ముఫాసా’ వంటి సినిమాలు పోటీగా ఉండటం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు అని స్పష్టమవుతుంది. మరి ఆదివారం ఏమైనా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందేమో చూడాలి.