Viduthalai: షూటింగ్ పూర్తి కాకుండానే ఫిలిం ఫెస్టివల్‌లో సినిమా విడుదల!

వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుదలై పార్ట్ 1’ విమర్శకుల ప్రశంసలను చక్కటి విజయం అందుకుంది. తమిళంలో మంచి విజయం అందుకున్నా తెలుగులో ఆ స్థాయి స్పందన అందుకోలేకపోయింది. అయితే ఓటీటీలో మాత్రం సినిమాకు మనవాళ్లు కూడా జైకొట్టారు. దీంతో సినిమా రెండో భాగం మీద అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లోనే కొంత ఫుటేజ్ చూపించి ఊరించిన వెట్రిమారన్ తాజాగా సినిమా రెండో పార్టును స్క్రీనింగ్‌ చేయించారు. దీంతో ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు.

రోటర్‌డ్యామ్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా రెండు పార్టులను ప్రద్శించారు. నిజానికి ‘విడుదల పార్ట్ 2’ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అయితే ఇప్పటిదాకా తీసిన ఫుటేజ్‌ను తెలివిగా ఎడిట్ చేయించి ప్రత్యేక వెర్షన్‌ను రూపొందించి దానిని అక్కడ సినిమాగా వేశారట. ఆ ఫుటేజ్‌ను చూసిన ప్రేక్షకులు అదిరిపోయింది అని మెచ్చుకుంటున్నారు. షో అవ్వగానే ఆహూతులు లేచి నిలబడి చప్పట్ల మోత మోగించడం విశేషం. సుమారు అయిదు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో ప్రేక్షకులు మెచ్చుకోవడం గమనార్హం.

ఈ ఏడాది వేసవిలోగా ‘విడుదలై పార్ట్ 2’ (Viduthalai) సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని వెట్రిమారన్‌ ఆలోచన. ఈ సారి అన్ని బాషల ఆడియన్స్‌ని అలరించేలా సినిమా ఉంటుందని అంటున్నారు. ‘విడుదలై పార్ట్ 1’ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర పరిమితంగా ఉందని, రెండో భాగంలో కథ మొత్తం ఆయన గురించే ఉంటుందని అంటున్నారు. సూరి, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘విడుదలై పార్ట్‌ 2’ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని చూస్తున్నారట.

ఇక తొలి పార్టు కథేంటంటే… కుమ‌రేశ‌న్ (సూరి) కొత్త‌గా ఉద్యోగంలో చేరిన పోలీస్ కానిస్టేబుల్‌. ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌ (విజ‌య్ సేతుప‌తి)ని ప‌ట్టుకునేందుకు ప‌నిచేస్తున్న ప్ర‌త్యేక‌ పోలీస్ ద‌ళంలో డ్రైవ‌ర్‌గా చేరతాడు. ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డ‌మే పోలీస్ విధి అనేది అతడి సిద్ధాంతం.

అయితే ఓసారి ఓ వృద్ధురాలిని కాపడాడటానికి పోలీసు జీపును ఉపయోగించి అధికారుల ఆగ్రహానికి గురవుతాడు. ఎలాంటి తప్పు చేయలేదని అందుకే ఎవరికీ క్షమాపణ చెప్పనని అంటాడు. మ‌రోవైపు గాయ‌ప‌డిన వృద్ధురాలి మ‌న‌వరాలు పాప (భ‌వానీ శ్రీ)తో కుమ‌రేశ‌న్ స్నేహం చేస్తాడు. అది కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఒకప‌క్క ప్రేమ‌, ఇంకోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేట‌లో కుమరేశన్‌ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి గురయ్యాడు అనేదే క‌థ‌.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus