Tharun Bhascker: వైరల్ అవుతున్న తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఒకరు కాగా తక్కువ సినిమాలే డైరెక్ట్ చేసినా ఈ దర్శకునికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. యూత్ ను మెప్పించే సినిమాలకు తరుణ్ భాస్కర్ ఎక్కువగా దర్శకత్వం వహించడం గమనార్హం. తాజాగా ఈ దర్శకుడు చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. అమ్మ రుణం కొంతైనా తీర్చుకున్నానంటూ ఈ దర్శకుడు కామెంట్లు చేయడం జరిగింది.

Tharun Bhascker

తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ ( Geetha Bhascker) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా (Fidaa) సినిమాలో గీతా భాస్కర్ నటించగా ఆమె నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ తన తల్లిని సింగపూర్ కు టూర్ కు తీసుకెళ్లడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది బాల్యంలో నన్ను స్కూల్ కు తీసుకెళ్లడానికి అమ్మ కిలోమీటర్ల దూరం నడిచేదని తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు.

బస్సుకు డబ్బులు లేక అమ్మ నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అమ్మ రుణాన్ని కొంచెం ఈ విధంగా తీర్చుకున్నానని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు. సింగపూర్ ట్రిప్ కు అమ్మను తీసుకొని వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నానని తరుణ్ భాస్కర్ కామెంట్లు చేయడం కొసమెరుపు. తరుణ్ భాస్కర్, ఆయన తల్లి సింగపూర్ పర్యటన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తరుణ్ భాస్కర్ దర్శకుడే అయినా పలు సినిమాల్లో నటుడిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మీకు మాత్రమే చెప్తా సినిమాలో తరుణ్ భాస్కర్ సోలో హీరోగా నటించగా ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. ఇడుపు కాయితం పంచాయతీ అనే మూవీతో ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus