Vignesh, Nayanthara: నయన్ ను అలా పిలుస్తానని చెప్పిన విఘ్నేష్ .. ఏం జరిగిందంటే?

నయనతార విఘ్నేష్ శివన్ క్యూట్ కపుల్ కాగా నయన్ హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు తెరకెక్కి సక్సెస్ సాధించాయి. తాజాగా విఘ్నేష్ శివన్ నయన్ తో ప్రేమలో ఎలా పడ్డానో చెబుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పోడా పోడి సినిమా ఫ్లాప్ కావడంతో ప్రేక్షకుల్లో నాపై నెగిటివ్ ఒపీనియన్ వచ్చిందని ఆ అభిప్రాయాన్ని మార్చడం కోసం ఎంతో కష్టపడ్డాడని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.

కెరీర్ లో మంచి సక్సెస్ ను అందుకోవాలని నేనూ రౌడీనే స్టోరీ రాశానని హీరో ధనుష్ ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలని అనుకున్నారని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. ధనుష్ నయన్ కు కథ చెప్పాలని సూచించగా నేను నజ్రియాతో సినిమా చేయాలని భావించానని ఆయన తెలిపారు. ధనుష్ చెప్పడం వల్ల నయన్ ను కలవగా ఆమె నన్ను ఎంతో గౌరవించిందని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలోనే నయన్ తో నేను ప్రేమలో పడిపోయానని (Vignesh) విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. నేనూ రౌడీనే మూవీ రెండో షెడ్యూల్ నుంచి మా ఇద్దరి డేటింగ్ మొదలైందని సెట్ లో నయన్ ను మేడమ్ అని పిలిచేవాడినని వృత్తి విషయంలో మేమిద్దరం అంత గౌరవంగా ఉంటమని ఆయన తెలిపారు. నయన్ కు, నాకు సింపుల్ గా ఉండటం అంటే ఇష్టమని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు.

మేమిద్దరం రైలులో ప్రయాణించగా అభిమానులు ఆనందంతో కేకలు వేశారని ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారని విఘ్నేష్ శివన్ తెలిపారు. కొన్ని పరిస్థితులలో ఫ్యాన్స్ ను ఏ విధంగా అదుపు చేయాలో అర్థం కాలేదని విఘ్నేష్ శివన్ తెలిపారు. విఘ్నేష్ శివన్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సరోగసి ద్వారా నయన్ విఘ్నేష్ శివన్ తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus