సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటీవల విగ్నేష్ శివన్ అని తమిళ దర్శకుడిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహం జరిగిన సమయం నుండి వీరిద్దరూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇటీవల అక్టోబర్ 9వ తేదీన కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశాడు. ఈ విధంగా పెళ్లి జరిగిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా ఇలా పిల్లల్ని కనడం చట్టా రీత్యా నేరం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
దీంతో తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ సరోగసి వివాదంపై ఒక ప్రత్యేక కమిటీని నియమించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో నయనతార దంపతులు వారికి ఆరు సంవత్సరాల క్రితమే చట్టబద్ధంగా రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని.. అంతేకాకుండా చట్ట నిబంధనలకు లోబడే ఒక సంవత్సరం క్రితమే సరోగసి పద్ధతి కోసం ప్రభుత్వం నుండి అంగీకారం తీసుకొని పిల్లలకి జన్మనిచ్చినట్లు నయనతార దంపతులు ప్రభుత్వానికి వెల్లడించారు. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వానికి సమర్పించడంతో
సరోగసి వివాదంలో నయనతార దంపతులకు ఊరట లభించిందని సమాచారం. తాజగా విఘ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ” ద్వేషం.. నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేయడం.. మనశ్శాంతి గురించి ఆసక్తికర పోస్ట్స్ చేశాడు. ఆరోగ్యం అనేది ఎప్పుడూ మెడిసిన్ వల్ల రాదు. మనశ్శాంతి అనేది హృదయంలో శాంతి, ఆత్మలో శాంతి నుంచి వస్తుంది. అలాగే నవ్వు, ప్రేమ నుంచి వస్తుంది’ అంటూ ఒక కొటేషన్ షేర్ చేశాడు.
ఆ తర్వాత ‘ద్వేషాన్ని.. నెగిటివిటి ఎంత తొందరగా వ్యాపిస్తుందో అంతే త్వరగా ప్రేమను పంచితే మనం జీవించే ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో కదా ‘ అంటూ మరో కోట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసి పోస్ట్ నెట్టింట వైరలవుతున్నాయి. సరోగసి చట్టాలను ఉల్లంఘించారని తమపై ఆరోపణలు చేయటం వల్ల పరోక్షంగా విఘ్నేష్ స్పందిస్తున్నట్లుగా తెలుస్తోంది.