Vignesh, Nayanthara: భార్యపై ప్రేమను కురిపిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన విగ్నేష్ శివన్!

కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ నటి నయనతారతో ఏడు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ నెలలో ఎంతో ఘనంగా వీరిద్దరు పెళ్లి బంధంతో ఒకటైన విషయం మనకు తెలిసిందే. ఇలా మూడుముళ్ల బంధంతో ఒకటైన ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇక వివాహమైన తర్వాత వీరిద్దరికి ఏమాత్రం విరామ సమయం దొరికిన వెంటనే విదేశాలకు వెళుతూ ఎంతో సంతోషంగా వీరి సమయాన్ని గడుపుతున్నారు.

ఇకపోతే నయనతార తన భర్త విగ్నేష్ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ లోని తన కుటుంబ సభ్యుల సమక్షంలో బుర్జ్‌ ఖలీఫా ముందు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఇలా తన భర్తకు సర్ప్రైజ్ పార్టీని అరేంజ్ చేసిన ఈమె కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఇకపోతే ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా విగ్నేష్ శివన్ ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా నయనతారపై ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని షేర్ చేసిన విగ్నేష్ శివన్ నయనతారతో కలిసి ఇది తన ఎనిమిదవ పుట్టినరోజు అంటూ చెప్పడమే కాకుండా, ఇదివరకు పుట్టినరోజులు కన్నా ఈ పుట్టినరోజు తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చారు.

ఇలా నయనతార గురించి విగ్నేష్ ఎంతో గొప్పగా చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ఈమె అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus