Vijay, Shah Rukh Khan: అట్లీ అదిరిపోయే ఆలోచన… 2 ఇండస్ట్రీలను కలుపుతున్నారట…. టార్గెట్‌ ఎంతో తెలుసా?

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు ఒక చిన్న భయం ఉంటుంది. సినిమా ఎలా వస్తుందో, ఒకవేళ సరిగ్గా రాకపోతే తర్వాత కెరీర్‌ విషయలో ఇబ్బందులు తప్పవు అని అనుకుంటూ ఉంటారు. అయితే వన్స్‌ అలాంటి సినిమాకు విజయం దక్కిందా? ఇక ఆ దర్శకుడిని ఇక ఎవరూ అతణ్ని ఆపలేరు. ఏకంగా స్టార్లతోనే ప్రయోగాలు చేయడానికి, వైవిధ్యమైన కథలు, కాంబినేషన్లకు సిద్ధమైపోతారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అట్లీ అదే పని చేస్తున్నారు. మొత్తంగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్‌ కాంబినేషన్‌ అవుతుంది కూడా.

అట్లీ… తొలి సినిమాను ప్రేమకథతో మొదలుపెట్టినా.. ఆ తర్వాత మొత్తంగా మాస్‌ కథలవైపు వచ్చేశారు. విజయ్‌తో వరుస బ్లాక్‌బస్టర్‌లు సంపాదించారు. ఆ తర్వాత ఏంటి? అని అనుకునేలోపే బాలీవుడ్‌ వెళ్లిపోయి అక్కడ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో సినిమా అనౌన్స్‌ చేశాడు. ఎలా ఉంటుందో అనే భయం వేసేలోపే పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేసి ఈ సినిమా మీ ఊహలకు మంచి అని చెప్పేశాడు. సినిమా వచ్చాక వసూళ్ల లెక్కలు వేసుకోవడానికే సరిపోయింది.

దీంతో అట్లీ తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్న మళ్లీ మొదలైంది. అంతేకాదు ఈసారి గత సినిమా కంటే భారీగా ఉండాలి అనే డిమాండ్లు కూడా అభిమానుల నుండి వస్తున్నాయి. మీరూ అలా డిమాండ్‌ చేసినవాళ్లే అయితే మీకు అట్లీ డబుల్‌ బొనాంజా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పొచ్చు. తనకు వరుస విజయాలు ఇచ్చిన విజయ్‌, రీసెంట్‌ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన షారుఖ్‌ ఖాన్‌ను కలపబోతున్నారు. ఈ మేరకు ప్రాజెక్ట్‌ను ఖాయం కూడా చేసుకున్నారు.

షారుఖ్‌ ఖాన్‌, విజయ్‌ని (Vijay) ఒకే ఫ్రేమ్‌లో చూపించడం ఖాయం. అదే స్క్రిప్టుపై పని చేస్తున్నా అని అట్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘జవాన్‌’ సినిమాలోని ‘జిందా బందా’ పాట షూటింగ్‌ జరుగుతున్నప్పుడు విజయ్‌, షారుఖ్‌ కలిశారు. ‘ఇద్దరు హీరోల సినిమా ఏదైనా చేయాలనుకుంటే చెప్పు మేం చేస్తాం’ అని షారుఖ్‌ ఆ సందర్భంలో చెప్పాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పైనే పని చేస్తున్నానని చెప్పిన అట్లీ… వాళ్ల ఇమేజ్‌కి తగ్గట్టుగా కథ ఉండేలా కసరత్తు చేస్తున్నానని, నా నెక్స్ట్‌ మూవీ అదే అవుతుంది అని కూడా చెప్పారు అట్లీ. అన్నట్లు ఈ సినిమాతో బాక్సాఫీసు దగ్గర రూ. 3000 కోట్లు వచ్చేలా ప్లాన్‌ చేసుకుంటున్నారని ఓ టాక్‌.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus