‘ఖుషి’ సినిమా విడుదలైన తర్వాత తొలినాళ్లలో వచ్చిన టాక్ చూశాక… ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ ఆ ఆనందాన్ని తన అభిమానుల్లో వంద కుటుంబాలకు పంచుదాం అనుకున్నారు. ఈ మేరకు #SpreadingKushi అనే కార్యక్రమం ఎంచుకున్నాడు. వంద కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తూ మొత్తంగా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ కార్యక్రమం పూర్తి చేశాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని.. వంద కుటుంబాల ఆనందానికి కారణమయ్యాడు.
అయితే విజయ్ (Vijay Devarakonda) ఈ క్రమంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన చిన్నతనంలో కుటుంబ పరిస్థితుల్ని వివరిస్తూ.. అప్పుడు ఎలా ఉండేవారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. నాకు ఇప్పుడు నిజమైన సంతోషం, సంతృప్తి లభించాయి. మీరంతా ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నా. నేను ఆరోగ్యంగా ఉంటూ.. పనిచేస్తున్నంత కాలం ఏటా ఏదో ఒక విధంగా సాయం చేస్తూనే ఉంటాను అని అభిమానులకు మాట ఇచ్చాడు. అంతేకాదు ఇప్పుడు తాను చేస్తున్నవన్నీ తన వ్యక్తిగత కోరికలు అని చెప్పాడు.
చిన్నప్పుడు ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక కొన్ని ఆనందాలకు దూరమయ్యానని, అందుకే ఇప్పుడు తాను హీరో అయ్యాక సంపాదన నుండి ఏటా కొంత మేర ఇలా సాయం రూపంలో ప్రజలకు ఇస్తున్నాను అని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఓ సందర్భంలో తమ్ముడి ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారనే విషయం కూడా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఎవరైనా ఒక లక్ష రూపాయలు ఇస్తే బాగుండని అనుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తానిచ్చిన రూ.లక్ష ఏదోరకంగా ఉపయోగపడితే చాలు అని చెప్పాడు.
అంతేకాదు డబ్బులు అందుకున్న వారు ఎవరూ తనకు థ్యాంక్స్ చెప్పొద్దని కూడా విజయ్ దేవరకొండ కోరాడు. దీంతో ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ‘రియల్ హీరో’ అంటూ విజయ్ దేవరకొండను ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్‌కు ఏరి కోరి డబ్బులు ఇవ్వడం అంటే పెద్ద విషయమే కదా.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!