విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) అర్జెంట్‌గా ఓ విజయం కావాలి. ఆ తర్వాత ఎప్పటిలానే ఆయన కోసం దర్శకులు, రచయితలు కథలు రాసుకోవాలి!.. గత కొన్నేళ్లుగా ఆయన ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. కెరీర్ ప్రారంభమైన తొలి నాళ్లలో చాలా కష్టాలు పడ్డ విజయ్.. ఒక్క విజయం అందుకోగానే తనకంటూ ఇమేజ్‌ను ఏర్పరుచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు, తొందర అడుగులు వేసి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఇతర హీరోలు నో చెప్పిన కథలు ఆయన వద్దకు వస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాడు.
నెక్స్ట్ లైనప్‌లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేరింది అని అంటున్నారు. నాని(Nani) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్న దర్శకుడు శౌర్యువ్(Shouryuv) . ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక కథ సిద్ధం చేసుకున్నారు అని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తారక్ (Jr NTR) కోసం చాలా ప్రయత్నాలు చేసి.. ఇప్పట్లో తేలేలా లేదు అని అర్థమయ్యాక అక్కడితో ఆ పని ఆపేశారు అని టాక్. ఇప్పుడు అదే కథను విజయ్ దేవరకొండకు చెబితే వెంటనే చేసేద్దాం అని అన్నాడట.
ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అయితే వెంటనే కాదు కానీ.. నెక్స్ట్ సినిమాల తర్వాతనే అని చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) ‘కింగ్డమ్’(Kingdom) ఒకటి కాగా.. రాహుల్ సాంకృత్యాన్ ( Rahul Sankrityan) సినిమా మరొకటి. ఇవి కాకుండా ‘రౌడీ జనార్దన్’ ఉంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కుతాయి అంటున్నారు. ఆ విషయం తర్వాత చూద్దాం. ఇప్పుడు టాపిక్ ఏంటంటే.. ఈ మూడు సినిమాల తర్వాత శౌర్యువ్ సినిమా ఉండొచ్చు అంటున్నారు.
అయితే ఆయన అన్ని రోజులు ఆగుతారా అనేదే ఇక్కడ ప్రశ్న. ఇప్పటికే ‘హాయ్ నాన్న’ వచ్చాక రెండు క్యాలెండర్లు మారిపోయాయి. రామ్‌చరణ్ (Ram Charan) అనుకోని పరిస్థితుల్లో వదులుకున్న ‘కింగ్డమ్’ ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు. ఇక తారక్ వద్దనుకున్న సినిమా కూడా చేస్తే.. సెకండ్ ఆప్షన్ అయిపోతాడు. కాబట్టి మంచి విజయం అందుకుని ఫస్ట్ ఆప్షన్‌గా మారాలి అని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ‘కింగ్డమ్’ ఆ విజయం ఇస్తుందేమో చూడాలి. మే 30న రావాల్సిన ఈ సినిమా జులైలో వస్తుంది అని సమాచారం.