టాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్‌లు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌లో ‘SSMB 29’ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. రాజమౌళి విజన్, మహేష్ నటనతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘AA 22’ సినిమాతో ‘జవాన్’ (Jawan) ఫేమ్ అట్లీతో (Atlee Kumar) కలిసాడు, ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
‘SSMB 29’ రిలీజ్ డేట్ గురించి రాజమౌళి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి సినిమాలు సాధారణంగా సమయం తీసుకుంటాయి, ఈ సినిమా కూడా 2026 చివరి లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అమెజాన్ అడవుల్లో చిత్రీకరణ, హాలీవుడ్ స్థాయి సీజీ వర్క్‌లతో ఈ సినిమా రూపొందుతుండటంతో, షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యమవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ ‘AA 22’ సినిమా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉంది.
అట్లీ ‘జవాన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ సినిమాను తీసుకురావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అట్లీ సాధారణంగా తన సినిమాలను వేగంగా పూర్తి చేసి, ప్రకటించిన సమయానికే విడుదల చేసే దర్శకుడిగా పేరున్నాడు. కానీ ‘AA 22’ సినిమా టెక్నికల్ అంశాలు, హై-ఎండ్ సీజీ వర్క్‌లతో ముడిపడి ఉండటంతో, ఈ సినిమా కూడా సమయం తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అయితే, అట్లీ ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచే పోస్ట్-ప్రొడక్షన్ వర్క్‌ల కోసం హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుపుతున్నాడు.
ఈ స్టూడియోలు అడ్వాన్స్‌డ్ సీజీ వర్క్‌లను వేగంగా పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అట్లీ సాధారణంగా ఏడాదిన్నరలో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసే కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తాడు. ‘AA 22’ సినిమా 2026 ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ లెక్కన ‘SSMB 29’ కంటే ముందు ‘AA 22’ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తాయో చూడాలి.