ఈ మధ్య సినిమా రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షోల నుండే హెచ్.డి క్వాలిటీతో కూడిన ప్రింట్లు పైరసీ వెబ్ సైట్స్ లో దర్శనమిస్తున్నాయి. స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game changer) సినిమా.. ఇలా మార్నింగ్ షో అయ్యిందో లేదో హెచ్.డి క్వాలిటీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆ సినిమాని బస్సుల్లో కూడా టెలికాస్ట్ చేసి.. జనాలను థియేటర్లకు వెళ్లకుండా చేశారు యాంటీ ఫ్యాన్స్. అలా ఆ సినిమా నెగిటివిటీ వల్ల పూర్తిగా చచ్చిపోయింది.
దర్శకుడు శంకర్ (Shankar) తీసిన ఆ సినిమాని రూ.400 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించారు దిల్ రాజు (Dil Raju). ఆ పాజిటివ్ యాంగిల్ కూడా జనాల్ని థియేటర్ కి తీసుకెళ్లలేదు. దానికి కారణం పైరసీనే అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) ‘తండేల్’ (Thandel) సినిమాలకి కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.
అయితే ఇలా సినిమాలు పైరసి అవ్వడానికి ముఖ్య కారణం చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi). ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ఓవర్సీస్ కాపీ ఏదైతే ఉందో.. ఆ వెర్షన్ పైరసీ అయ్యిందని నాగవంశీ వివరించాడు. రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా ఇలాగే పైరసీకి గురయ్యిందని గుర్తించినట్లు కూడా నాగవంశీ తెలిపారు.
దీనిని అరికట్టడం అనేది ఒక్కడితో కాదని, ఈటీవీ విన్ వాళ్ళు ఏ విధంగా అయితే పైరసీని కంట్రోల్ చేస్తున్నారో.. ఆ టెక్నిక్ ని వాడాలని.. నాగ వంశీ చెప్పుకొచ్చారు. ఇప్పుడైనా నిర్మాతలంతా ఒక మీటింగ్ పెట్టుకుని, దీనిపై చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే… బాగుంటుందనేది ఇండస్ట్రీ వాళ్ళ అభిప్రాయం.
ఓవర్ సీస్ సెన్సార్ కాపీ నుండీ పైరసీ వస్తుంది#NagaVamsi #MadSquare #Mad pic.twitter.com/H8HMk7nTMb
— Filmy Focus (@FilmyFocus) April 1, 2025