Vijay Devarakonda: ‘లైగర్‌’ గురించి ఎలా చెప్పుకోవాల్సి వచ్చిందో చూశారా!

హీరో ఏదైనా సినిమా చేస్తే.. మనది అనుకుని మరీ అక్కున చేర్చుకుంటారు ప్రేక్షకులు. అయితే ఆ సినిమా టీమ్‌ నుండి, సినిమా ప్రచారం, మూవీ లుక్స్‌ నుండి అలాంటి ఫీలింగ్‌ రాకపోతే.. చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ‘లైగర్‌’ విషయంలో జరుగుతోంది ఇదే. ప్రాపర్‌ తెలుగు సినిమాగా స్టార్ట్‌ అయిన ‘లైగర్‌’.. ఇప్పుడు బాలీవుడ్‌ మూవీగా మారిపోయింది. సినిమా లుక్స్‌, ఫీల్‌, ప్రచారం.. ఇలా ఎందులో చూసిన బాలీవుడ్‌ వాసన వస్తోందని ఫ్యాన్స్‌ మనసు చిన్న చేసుకుంటున్నారు. దీనిపై విజయ్‌ దేవరకొండ ఇటీవల స్పందించారు.

ఓ తెలుగు సినిమా గురించి, ఓ తెలుగు హీరో.. ప్రచారంలో భాగంగా ‘ఇది తెలుగు సినిమానే మహాప్రభో’ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో స్టేజీ మీద కెమెరాలకు, మీడియాకు కాళ్లు, బూట్లు చూపిస్తూ మరీ తన క్లారిటీ ఇచ్చాడు. ఇలా ఆరామ్‌ సే కూర్చుని మాట్లాడండి అంటూ తన కొత్త బూట్లు చూపించాడు విజయ్‌. అలా ఎందుకు చూపించాడు, ఆ యాటిట్యూడ్‌ అర్థమేంటి అనేది పక్కన పెడితే.. తెలుగు సినిమాను ఇది తెలుగు సినిమానే అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ప్రశ్న.

‘లైగర్‌’ సినిమాకు పూరి జగన్నాథ్‌ దర్శకుడు. సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు, మొదలుపెట్టినప్పుడు సినిమాకు నిర్మాత ఛార్మి ఉరఫ్‌ పూరి జగన్నాథ్‌ నిర్మాత. అయితే తర్వాత చాలా కారణాల వల్ల సినిమాకు బాలీవుడ్‌ వెర్షన్‌ నిర్మాతగా ఉన్న కరణ్‌ జోహర్‌ పూర్తి స్థాయి నిర్మాత అయ్యారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఆయన పూర్తి స్థాయి నిర్మాత కాబట్టే.. సినిమా అంతా ఆయన చెప్పినట్లుగా నడుస్తోంది. ఓ బాలీవుడ్‌ సినిమా టీమ్‌ హైదరాబాద్‌ వచ్చి ప్రచారం చేసిన వెళ్లినట్లు ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు.

దీంతో ఈ సినిమా తెలుగా? హిందీ నుండి తెలుగు డబ్బింగా? అనే ప్రశ్న విజయ్‌ ఎదుట వచ్చింది. దానికి విజయ్‌ ‘‘లైగర్’ పక్కా తెలుగు సినిమా. హిందీలా కనిపిస్తుందనే చర్చ మన తెలుగు ఆడియన్స్‌లో ఉన్నమాట నాకూ తెలిసిందే. ఎందుకలా అనుకుంటున్నారో నాకు అర్థమవుతోంది. ఇందులో పాటలు చేసింది హిందీ కంపోజర్స్. షూట్ చేసినపుడు హిందీ వెర్షన్‌తోనే చేశాం. సినిమా మాత్రం పక్కా తెలుగు. హిందీ, తెలుగు.. రెండిట్లో షూట్ చేశాం. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమా అని ఫీల్‌ అవుతారు. లైగర్ మన సినిమా. మన సినిమాను ఇండియాకి చూపిస్తున్నాం” అని వివరణ ఇచ్చాడు విజయ్‌.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus